శభాష్ కలెక్టర్ సార్.. ప్రపంచ బాలికల దినోత్సవం.. వినూత్న ఆలోచన.. అనంతపురం కలెక్టర్....

అక్టోబర్ 11న ప్రపంచ బాలికల దినోత్సవం పురస్కరించుకొని అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు.ఒక వినూత్నమైన ఆలోచన చేశారు.

 Shabash Collector Sir World Girls Day  Innovative Thinking  Anantapur Collector-TeluguStop.com

ప్రపంచంలో స్త్రీ ప్రాముఖ్యత కు అద్దం పట్టే విధంగా, ప్రపంచ బాలికల దినోత్సవాన్ని కొత్త ఆలోచనతో జరిపారు.అనంతపురం జిల్లా అంతా వివిధ అధికారిక కార్యాలయాల్లో నిన్న ఉదయం 11:00 నుండి సాయంత్రం 6 గంటల వరకు వివిధ ప్రదేశాల నుండి.వివిధ తరగతులు చదువుతున్న బాలికలకు ఆయా కార్యాలయాల్లో ఉన్న, ఉన్నత అధికారులు స్థానంలో బాలికలకు, ఆ అధికారిక హోదాను ఇచ్చి వారితోనే ఒక్కరోజు పరిపాలన చేయించారు.

ఈ నేపథ్యంలో చారిత్రక అవకాశం జిల్లాలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఎం శ్రావణని వరించింది.

జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దగ్గరుండి ఆ అమ్మాయికి కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడానికి ఆయన మార్గదర్శి అయ్యారు.ఆ అమ్మాయి ఒక రోజు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించడానికి ఆ కలెక్టరే.

కర్త, కర్మ, క్రియ అయ్యారు.ఆ అమ్మాయి తన జీవితంలో ఒక ఉన్నత లక్ష్యాన్ని ఎన్నుకోవడానికి కలెక్టర్ గంధం చంద్రుడు మార్గదర్శి అయ్యారు.

ఈ వినూత్న కార్యక్రమం జిల్లాలో పలువురు విద్యార్థులను కలెక్టర్, జిల్లా అధికారులు, పంచాయతీ కార్యదర్శులను చేసింది.ఒక ఐఏఎస్ అధికారి ఆలోచనా సరళి, ఎంత ఉన్నతంగా ఉందో, ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటుందో, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడుని చూస్తే అర్థం అయ్యే విధంగా.

దేశానికి వివరించి చూపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube