దిల్‌ రాజు సినిమా అప్పుడే అమెజాన్ లో స్ట్రీమింగ్‌ కు రెడీ

టాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత దిల్‌ రాజు వరుసగా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాడు.దిల్‌ రాజు చేస్తున్న సినిమా అంటే ఖచ్చితంగా మ్యాటర్‌ ఉంటుంది అంటూ అంతా బలంగా నమ్ముతున్నారు.

 Shaadi Mubarak In Ott Amazon Prime In One Week Of Theatrical Release , Shaadi Mu-TeluguStop.com

అలాంటి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్న దిల్‌ రాజు ఇటీవలే ‘షాదీ ముబారక్‌‘ అనే సినిమాను విడుదల చేశాడు.ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇది దిల్ రాజు సినిమా నా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

అసలు ఈ సినిమా ను ఎలా దిల్‌ రాజు తీసుకున్నాడు అంటూ అవాక్కవుతున్నారు.షాదీ ముబారక్‌ సినిమా కనీసం వారం రోజులు కూడా థియేటర్‌ లో ఆడలేదు.

సినిమాను విడుదల చేసేందుకు దిల్ రాజు ముందుకు వచ్చినందుకు ఏమైనా ప్రతిఫలం దక్కిందా అంటే లేదు నష్టాలే మిగిలాయి అంటూ టాక్‌ వినిపిస్తుంది
.

సినిమా ఎలాగూ థియేటర్‌ లలో ఆడటం లేదు కనుక అమెజాన్‌ లో అయినా స్ట్రీమింగ్‌ కు సిద్దం చేద్దాం అన్నట్లుగా నిర్మాతలు నిర్ణయానికి వచ్చారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నేడు అర్థ రాత్రి నుండి అమెజాన్ లో స్ట్రీమింగ్‌ కు షాదీ ముబారక్ సిద్దం అయ్యింది.ఇటీవల విడుదల అయిన గాలి సంపత్ సినిమా తో పాటు మరి కొన్ని సినిమాలు కూడా థియేటర్లలో ఆకట్టుకోక పోవడంతో ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

గతంలో సినిమాలు థియేటర్లలో విడుదల అయిన 50 రోజుల తర్వాత కాని ఓటీటీ లో విడులకు అవకాశం ఉండేది కాదు.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.

ఓటీటీలో చూసేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో వెంటనే ఇక్కడ కూడా విడుదల చేస్తున్నారు.థియేటర్లలో నిరాశ మిగిల్చిన ఈ సినిమా ఓటీటీలో అయినా ఆకట్టుకుంటుందా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube