“బాలుడి” ని తనకోరిక తీర్చమన్న “మాష్టారు”     2018-05-18   01:29:22  IST  Raghu V

రాను రాను ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది..ఎప్పుడు ఎలాంటి వార్తా వినాల్సి వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది..ఎటు చూసినా నేరాలు ఘోరాలే..వాయి వరసలు లేకుండా చెల్లి ,పిన్ని ,అక్క వదినలపై కామాన్ని ప్రదర్శిస్తున్న మ్రుగాళ్ళు తయారవుతున్నారు..ఇలాంటి సంఘటనలు రోజూ వింటూనే ఉన్నాము అయితే తాజాగా జరిగిన ఒక సంఘటన అందరినీ విస్తు పోయేలా చేసింది.. అదేమిటంటే.


ఓ బాలుడిపై తనకి పాఠాలు చెప్పే మాష్టారు లైంఘిక దాడికి పాల్పడ్డాడు..లింఘ భేదం కూడా మరిచి పోయిన ఆ మాష్టారు బాలుడిపై దాడికి పాల్పడటం టోలిచౌక్ ప్రాంతంలో గుప్పుమంది పోలీసుల కధనం ప్రకారం..టోలిచౌకి పారామౌంట్‌ కాలనీకి చెందిన జీషాన్‌ ఎండీలైన్స్‌లోని మజీద్‌ అల్‌ కౌసర్‌లో అరబిక్‌ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మదర్సాలో నిర్వహిస్తున్న సమ్మర్‌ ఇస్లామిక్‌ క్యాంపులో విద్యార్థులకు అరబిక్‌ నేర్పుతున్నాడు.


అయితే గత కొంత కాలంగా మదర్సాకు వస్తున్న ఓ బాలుడిని సదరు మాష్టారు వేధించడమే గాక తన కోరిక తీర్చమని అంటూ వెంటపడుతున్నాడట..అంతేకాదు తన మాట వినకపోతే నీకు చదువు రాదంటూ భయపెట్టించాడు. ఈ నెల 13న అతను బాలుడిని మదర్సాలోని గదిలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. అయితే ఆ సంఘటనతో ఉలిక్కిపడిన ఆ బాలుడు అతడి భారినుంచి తప్పించుకుని తల్లి తండ్రులకి ఫిర్యాదు చేశాడట..దాంతో భాదితుడి తల్లిదండ్రులకు బుధవారం రాత్రి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.