నేటి సమాజంలో ప్రేమా దోమా అంటూ నమ్మితే వంచనకు గురికావడం ఖాయమని నిత్యం లోకంలో జరుగుతున్న సంఘటనలను చూస్తే అర్ధం అవుతుంది.అమ్మాయిలపై ఎన్ని దారుణాలు జరుగుతున్నా గుడ్డిగా ప్రేమలో పడి మోసపోతూనే ఉన్నారు యువతులు.
అయినా ఎలాంటి మార్పు రావడం లేదు.ఇలాగే ఓ మగపురుగు ఒక అమ్మాయిని నిండా ప్రేమలో ముంచి.
ఆ అమ్మాయిని తనివితీరా అనుభవించి ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరిస్తున్నాడట.
ఇక ఈ ఘటన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో జరిగింది.
ఇంటర్ చదువుతున్న విద్యార్థిని(16)పై ఇదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో నమ్మించి అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా అర్ధనగ్నంగా ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతానని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడట.
అతని బాధ భరించలేని ఆ యువతి చివరికి ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
కాగా లైంగికదాడికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన మరో ఇద్దరిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.