సుప్రీం కోర్ట్ సీజేపై లైంగిక ఆరోపణలు! దేశ వ్యాప్తంగా సంచలనం.  

Ual Harassment Allegation On Supreme Court Chief Justice -

ఈ మధ్య కాలంలో పలు కీలక కేసులలో తీర్పులు చెబుతూ దేశ వ్యాప్తంగా సంచలనాలకి కేంద్ర బిందువుగా మారిన వ్యక్తి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్.ఇక త్వరలో కూడా మరిన్ని కీలక కేసులపై అతనే తీర్పు చెప్పనున్నారు.

Sexual Harassment Allegation On Supreme Court Chief Justice

ఇలాంటి సందర్భంలో ఊహించని విధంగా రంజన్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు సుప్రీం న్యాయమూర్తులకు ఫిర్యాదు చేసింది.ఇప్పుడు ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఆ మహిళా ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం ఇవాళ అత్యవసర విచారణ చేపట్టింది.ముగ్గురు సభ్యులు గల ఈ బెంచ్‌లో జస్టిస్ గొగోయ్‌తో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నా ఉన్నారు.

ఇదిలా ఉంటె తనపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీవ్రంగా ఖండించారు.న్యాయవ్యవస్థ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని అయితే అది ఎప్పటికీ బలిపశువుగా మారబోదని ఘాటుగా స్పందించారు.20 ఏళ్ల న్యాయవాద జీవితంలో తనపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, దీంతో ఏమీ చేయలేక తనని తప్పించడానికి కొందరు కుట్ర పూరితంగా ఇలా ఆరోపణలు చేయించారని ఆయన చెప్పుకొచ్చారు.మరి దీనిలో వాస్తవాలు ఏంటి అనేది త్వరలో విచారణలో తెలిసే అవకాశం ఉంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ual Harassment Allegation On Supreme Court Chief Justice- Related....