బాలిక పై యువకుడు చేసిన అఘాయిత్యానికి పెద్దలు చెప్పిన తీర్పు..!

అమ్మాయిల రక్షణ విషయంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా వీరికి సమాజంలో రక్షణ లభిస్తలేదని చెప్పవచ్చూ.నిత్యం స్త్రీల పై జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే అడవిలో మృగాలు అయినా నయం అనిపిస్తుంది.

 Sexual Assault On Girl Boy Fined Rs 2 Lakh-TeluguStop.com

ఇదిలా ఉండగా ఒక బాలికపై మదం ఎక్కిన యువకుడు చేసిన అఘాయిత్యానికి ఆ ఊరి పెద్దల తీర్పు సమాజంలోని లోపాలను వేలెత్తేదిగా చూపిస్తుంది.యూపీలోని మీరట్‌ జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణం తాలూకు వివరాలు చూస్తే.

సర్ధాన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఉండే యువకుడు బీఏ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడట.ఇతను తన తన పొరుగున ఉండే బాలికతో స్నేహం చేసి మెల్లగా మాయమాటలు చెప్పి ఆమెను లోబరుచుకున్నాడు.

 Sexual Assault On Girl Boy Fined Rs 2 Lakh-బాలిక పై యువకుడు చేసిన అఘాయిత్యానికి పెద్దలు చెప్పిన తీర్పు..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చగా అబార్షన్‌ కూడా చేయించాడట.అలా ఆమె ఆరోగ్యం క్షిణించడంతో అసలు నిజాన్ని బయట పెట్టిందట.

కాగా ఈ వివాదం పంచాయితీకి చేరింది.ఈమేరకు పంచాయితీ పెద్దలు నిందితుడుని మూడేండ్లు గ్రామం విడిచివెళ్లాలని రూ రెండు లక్షలు జరిమానా చెల్లించాలని తీర్పు చెప్పారట.

అయితే ఈ ఉదంతం తమ దృష్టికి రాలేదని పోలీసులు తెలపడం ఆశ్చర్యం.ఇకపోతే ఒక స్త్రీ శీలానికి వెలకట్టే ఈ రోజులను చూసి సమాజం తలదించుకోవాలని అనుకుంటున్నారట.

#Meerut #Sexual Assault #Rs 2 Lakh #Girl Fined

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు