ఏడో తరగతి చ‌దివి.. క‌రోనా టీకా త‌యారు చేసిన వ్య‌క్తి.. చివ‌ర‌కు..  

a seventh standard man made corona vaccine in odisha! seventh standard man, corona vaccine, odisha, latest news, coronavirus, covid-19 - Telugu Corona Vaccine, Coronavirus, Covid-19, Latest News, Odisha, Seventh Standard Man

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ చాప కింద నీరులా విస్త‌రిస్తూ.ప్ర‌పంచ‌దేశాలు పాకేసిన సంగ‌తి తెలిసిందే.

TeluguStop.com - Seventh Standard Man Made Corona Vaccine In Odisha

గ‌త ఏడాది చైనాలోని వూహాన్ న‌గ‌రంలో వెలుగు చూసిన క‌రోనా వైర‌స్‌.తొమ్మ‌ది నెల‌లు గ‌డిచినా అదే జోరుతో విజృంభిస్తోంది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏకంగా 3కోట్ల 30లక్షలు దాటేసింది.మ‌రోవైపు మ‌ర‌ణాలు కూడా భారీ స్థాయిలో పెర‌గాయి.

TeluguStop.com - ఏడో తరగతి చ‌దివి.. క‌రోనా టీకా త‌యారు చేసిన వ్య‌క్తి.. చివ‌ర‌కు..-General-Telugu-Telugu Tollywood Photo Image

నేటికి క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 10 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్నాయి అంటే ప‌రిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఊహించుకోవ‌చ్చు.

అయితే మ‌రోవైపు క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి మాన‌వుల‌ను ర‌క్షించేందుకు ప్ర‌పంచ‌దేశాల శాస్త్ర‌వేత్త‌లు, నిపులు వ్యాక్సిన్ కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు.

ఎన్నో ప్ర‌యోగాలు చేస్తున్నారు.ఇలాంటి త‌రుణంలో ఏడో త‌ర‌గ‌తి చ‌దివిన బీసీ ప్రహ్లాద్ అనే వ్య‌క్తి ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనాకు వ్యాక్సిన్ త‌యారు చేశాన‌ని.

ఆ టీకాను మార్కెట్లో విక్రయించేందుకు అనుమతించాలని అధికారులకు లేఖ రాశాడు.

మ‌రో విష‌యం ఏంటంటే.

అనుమతి లభించే వరకూ దాన్ని విక్రయించరాదనే నిబంధ‌న కూడా పెట్టుకున్నాన‌ని తెలియ‌జేశారు.ఈ ఘ‌ట‌న ఒడిశాలోని బార్ఘర్ జిల్లా లో చోటుచేసుకుంది.

ఇక‌ ప్రహ్లాద్ లేఖ‌ను అందుకున్న అధికారులు.హుఠాహుఠిన అత‌డికి ఇంటికి వెళ్లి ఆరా తీశారు.

ఈ క్ర‌మంలోనే అత‌డి ఇంట్లో కరోనా వ్యాక్సిన్ అని రాసున్న వయల్స్ తో పాటు ప‌లు ర‌సాయ‌నాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

అనంత‌రం అత‌డిని వ్యాక్సిన్ ఎలా త‌యారు చేశార‌ని ప్ర‌శ్నించ‌గా.

తన ప్రయోగం అత్యంత రహస్యమని.ఆ విష‌యాలు బ‌య‌ట‌కు చెప్ప‌న‌ని తేల్చి చెప్పాడు.

ఇక ఎన్ని సార్లు ప్ర‌శ్నించినా అదే స‌మాధానం ఇస్తుండ‌డంతో.అధికారులు అత‌డిపై కేసు న‌మోదు చేసి లోతుగా విచార‌ణ చేప‌ట్టారు.

ప్ర‌స్తుతం ఈ విష‌యం నెట్టింట్లో వైర‌ల్ అవ్వ‌గా.నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

#Corona Vaccine #Odisha #COVID-19 #SeventhStandard #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Seventh Standard Man Made Corona Vaccine In Odisha Related Telugu News,Photos/Pics,Images..