పిల్లోడి గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన సీఎం స్టాలిన్.. !

మానవత్వం మనిషి వయస్సుని బట్టి రాదని నిరూపించాడు ఓ ఏడేళ్ల బుడ‌త‌డు.కోట్ల కొద్ది సొమ్మును దాచుకుని మానవత్వం మరచి మసలుకుంటున్న ఎందరో ధనికులకు కనువిప్పు కలిగే ఈ ఘటన గురించి తెలుసుకుంటే.

 Seven Year Old Boy Harish Varman Financial Aid For The Corona Patients In Madurai-TeluguStop.com

కరోనా సోకిన వారి పట్ల మాన‌వ‌త్వంతో మెలిగాడు మ‌ధురైకి చెందిన హ‌రీష్ వ‌ర్మ‌న్‌(7) అనే బాలుడు.గ‌త రెండేళ్ల నుంచి సైకిల్ కొందామ‌ని జ‌మ చేసుకుంటున్న డ‌బ్బును క‌రోనా రోగుల కోసం ఖ‌ర్చు పెట్టాల‌ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అంద‌జేశాడు.

కాగా ఈ పిల్లోడి గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన సీఎం స్టాలిన్ ఆ బాలుడికి సైకిల్ ఇప్పించాడు.చూశారా వేల కోట్లు మూలుగుతున్న పైసా ఖర్చుపెట్టని మనుషులున్న ఈ సమాజాన్ని చూసి సిగ్గుపడాలి.

 Seven Year Old Boy Harish Varman Financial Aid For The Corona Patients In Madurai-పిల్లోడి గొప్ప మ‌న‌సుకు ఫిదా అయిన సీఎం స్టాలిన్.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక పిల్లలకు చిన్న వయస్సు నుండే ఇలాంటి మంచి అలవాట్లు నేర్పిస్తే కొంతవరకైన సమాజానికి మేలు చేసిన వారం అవుతాం.

ఇదిలా ఉండగా కరోనా కారణంగా పేదలు పడుతున్న కష్టాలను చూస్తుంటే సోయిలేకుండా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాల తీరు సభ్య సమాజానికి, మనదేశానికే కలకంగా మారుతుంది.

ఒకవైపు చేతిలో చిల్లిగవ్వలేక, ఉపాధి కోల్పోయి అలమటిస్తున్న సమయంలో పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల సామాన్యుల నిత్యావసరాలన్ని ఆకాశాన్ని అంటాయి.ప్రజలకు మేలు చేసే ప్రభుత్వాలు కావాలి గానీ, ఇలాంటి సమయంలో ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చుకుతింటున్న నేతలు కాదు.

ఇకనైన ప్రజలు మేల్కొని అవినీతి నాయకుల భరతం పడితే గానీ జీవితాలు బాగుపడవు.

#Madurai #Cm Relief Fund #Harish Varman #DonatedTo #Cm Stalin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు