ప్రస్తుత కాలంలోని కొందరు మృగాళ్లు లాంటి వ్యక్తులు చేసేటువంటి పనుల కారణంగా అభం శుభం తెలియని ఆడపిల్లల జీవితాలు ఆదిలోనే అంతం అవుతున్నాయి.తాజాగా ఓ అభం శుభం తెలియని మైనర్ బాలికపై మృగాళ్ళు లాంటి 10 మంది యువకులు గత 3 సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతున్నటువంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందినటువంటి కోయంబత్తూర్ ప్రాంతంలో పనుల కోసం వలస వచ్చినటువంటి ఇద్దరు దంపతులు మరియు వారి కుమార్తె నివాసం ఉంటున్నారు.కాగా బాలిక దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది.
అయితే స్థానికంగా ఉన్నటువంటి మరియు బాలిక తోటి విద్యార్థి ఐన ఓ బాలుడు బాలికను ప్రేమిస్తున్నానంటూ గత కొద్దికాలంగా వెంటపడుతున్నాడు.దీంతో విద్యార్థి మాయ మాటలు నమ్మినటువంటి బాలిక అతడికి సర్వస్వం అర్పించింది.
అయితే వీరిద్దరూ ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో చూసినటువంటి విద్యార్థి స్నేహితుడు బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు.అంతేగాక ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
అలాగే తన తోటి స్నేహితులతో కూడా బాలికపై అత్యాచారం చేయించాడు.
ఇలా దాదాపుగా స్థానికంగా ఉన్నటువంటి 10 మంది యువకులు గత మూడు సంవత్సరాల కాలంగా బాలికపై అత్యాచారానికి పాల్పడుతూ వారి కామ వాంఛలను తీర్చుకుంటున్నారు.
అయితే తాజాగా బాలిక గర్భం దాల్చడంతో తల్లిదండ్రులు ఇందుకు కారణం ఎవరంటూ నిలదీయగా బాలిక తన పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి చెప్పుకొచ్చింది.
ఒక్కసారిగా విషయాన్నితెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు కంగు తిన్నారు.
అలాగే వెంటనే బాలిక తండ్రి బాలికను వెంటబెట్టుకొని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురు పై జరిగినటువంటి అఘాయిత్యం గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ విషయం ఒక్కసారిగా స్థానిక ప్రాంతంలో కలకలం రేపింది.
బాధితురాలి తండ్రి తెలిపిన టువంటి వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.