భార్యాభర్తలు లేదా లవర్స్ గొడవపడ్డప్పుడు ఈ 7 పనులు అస్సలు చేయద్దు.! ఎందుకో తెలుసా.?  

7 Tips To Improve Husband And Wife Relationship-

భార్యభర్తలు లేదా లవర్స్ అన్నాక అప్పుడప్పుడు గొడవలు పడడం సహజం.అలాంటి సందర్భాల్లో కొందరు విడిపోతే కొందరు సర్దుకుపోతుంటారు.అయితే ఇంకొందరు ఇతరుల సలహాలు, సూచనలు విని ఆ ప్రకారం ఫాలో అవుతారు.ఈ క్రమంలోనే ఎదుటి వారు ఇచ్చే సలహాలు కొన్ని రాంగ్‌ అవుతుంటాయి.

7 Tips To Improve Husband And Wife Relationship- Telugu Viral News 7 Tips To Improve Husband And Wife Relationship--7 Tips To Improve Husband And Wife Relationship-

కానీ కొందరు మంచి సలహాలే ఇస్తారు.అయినప్పటికీ వాటిని పాటించడం వల్ల కపుల్స్‌ మధ్య గొడవలు తగ్గడం కాదు, ఇంకా పెరుగుతాయి.

ఈ క్రమంలోనే ఎదుటి వారు చెప్పే సలహాలను, సూచనలను అంత గుడ్డిగా ఫాలో అవరాదు.మరి అలా ఫాలో అవకూడని సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.!

1.కపుల్స్‌ గొడవపడినప్పుడు వారికి వేరే పార్ట్‌నర్‌ను చూసుకోమని సలహా ఇస్తారు.

దీంతో ఎవరి బతుకు వారు బతకవచ్చని అనుకుంటారు.అయితే ఇది మంచి సలహాయే అయినప్పటికీ అన్ని సందర్బాల్లో పనిచేయదు.

కనుక ఇలాంటి సలహాలను కపుల్స్‌ ఫాలో అవరాదు.ఆచి తూచి అడుగు వేయాలి.

2.గొడవ పెట్టుకున్న కపుల్స్‌కు కొందరు ఏమని సలహా ఇస్తారంటే.

నువ్వు బాస్ గా అజమాయిషీ చెయ్యి, అప్పుడు నీ పార్ట్‌నర్‌ నీ సలహా వింటారు.అని చెబుతారు.అయితే అలా చేయకూడదు.అవతలి వారికి ప్రేమతో సర్ది చెప్పుకోవాలి.అంతేకానీ వారిపై అజమాయిషీ చెలాయించాలి అని అనుకోకూడదు.అది రిలేషన్‌ షిప్‌ను దెబ్బ తీస్తుంది.

3.కపుల్స్‌ మధ్య అన్యోన్యత లేనప్పుడు కొందరు వారికి ఏమని సలహా ఇస్తారంటే.

పార్ట్‌నర్‌ను మరింత రొమాంటిక్ గా ఉండమని అంటారు.కానీ అందులో నిజం లేదు.

ప్రేమతో దగ్గరకు తీసుకోవాలి కానీ పార్ట్‌నర్‌ నుంచి రొమాన్స్‌ను ఎప్పుడూ ఆశించకూడదు.

4.సైలెంట్‌ గా ఉండు.సమస్య అదే పరిష్కారమవుతుంది.అని కొందరు కపుల్స్‌కు సలహా ఇస్తారు.కానీ ఇది అన్ని సార్లు పనికిరాదు.ఒక్కోసారి సైలెంట్‌గా ఉంటే పనులు జరగవు.కనుక దీన్ని కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

5.నీ పార్ట్‌నర్‌ నిన్ను మోసం చేస్తున్నాడు/ చేస్తుంది, కనుక అతను/ఆమెపై నిఘా పెట్టు.

వారి చాట్‌ చెక్‌ చేయి.రోజూ ఎవరెవరికి కాల్‌ చేస్తున్నారో చూడు, అని కొందరు చెబుతారు.

ఇది కూడా పాటించకూడదు.అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది.

6.అతను సంపాదిస్తుంది తక్కువ, నీకు సరిపోవడం లేదు అని కొందరు కపుల్స్‌లో లేడీస్‌కు చెబుతారు.

అయితే లేడీస్‌ దాన్ని నమ్మకూడదు.ఎందుకంటే పార్ట్‌నర్‌ ఎంత సంపాదిస్తున్నాడు అని కాదు చూడాల్సింది, ఎంత ప్రేమను పంచుతున్నాడు అని చూడాలి.

7.చూడు, నన్ను చూసి నేర్చుకో, బాగు పడతావు.అని కపుల్స్‌లో ఆడ, మగ ఇద్దరు ఒకరికొకరు అనుకోకూడదు.అది ఒకరిని మరొకరు కించ పరిచినట్టే అవుతుంది.

తాజా వార్తలు