తీన్మార్ మల్లన్న వ్యవహారంతో బీజేపీకి ఎదురుదెబ్బ... ఏం చేసాడంటే?

తెలంగాణ బీజేపీ రోజు రోజుకు టీఆర్ఎస్ టార్గెట్ గా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే.అయితే బీజేపీ తన దూకుడుతో మరింతగా నవ్వుల పాలవుతున్న పరిస్థితి ఉంది.

 Setback For The Bjp With The Teenmar Mallanna Affair  What Has Been Done Bjp Tel-TeluguStop.com

రాజకీయంగా విమర్శలు ఎన్నో చేయవచ్చు కాని అన్ని రాజకీయ పార్టీల ఉద్దేశ్యం ఉండాలి తప్ప రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా ఉండకూడదు.అచ్చం ఇలాగే బీజేపీ నేత తీన్మార్ మల్లన్న చేసిన ఓ ట్వీట్ రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇటీవల భారత్ లో టెస్లా కంపెనీ ఏర్పాటుపై ఓ నెటిజన్ చేసిన ట్వీట్ కు స్పందించిన ఎలన్ మస్క్ భారత ప్రభుత్వంతో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయని చేసిన ట్వీట్ కు మంత్రి కేటీఆర్ టెస్లాలో భాగస్వామ్యం కావడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, టెస్లా సంస్థ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్రంలో తగిన అవకాశాలు ఉన్నాయని చేసిన ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే మంత్రి కేటీఆర్  చేసిన ట్వీట్ ను ఎలన్ మస్క్ కి ట్యాగ్ చేస్తూ తీన్మార్ మల్లన్న తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా అని వేసిన పోల్ ను జత చేసి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్ధి జరగడం లేదని ట్వీట్ చేసారు.

అయితే తీన్మార్ మల్లన్న ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమని స్వంత బీజేపీ నేతలే కొందరు అభిప్రాయ పడుతున్నట్టు తెలుస్తోంది.

Telugu @bandisanjay_bjp, @bjp4telangana, @ktrtrs, Elon Musk, Resla, Telangana, T

సరైన సమయం కొరకు వేచి చూసి దెబ్బ కొట్టే వ్యూహాన్ని ప్రయోగించే కేసీఆర్ కు బీజేపీ ఏ విషయంలోనూ దొరకకపోతే వచ్చే సార్వత్రిక ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగలదు.ఇలాంటి వ్యక్తిగత ఎజెండాతో  నేతలు ముందుకెళ్తే బీజేపీకి చాలా నష్టం కలిగించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా లేదా అనేది భారత ప్రభుత్వ లెక్కలు చూస్తే తెలుస్తుందని టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube