చర్మ సమస్యలకు అద్భుతమైన రహస్యమైన నూనె....ఏమిటో తెలుసా?  

sesameoil skin benefits -

ప్రతి ఒక్కరు అందమైన మచ్చలు లేని ముఖం ఉండాలని కోరుకుంటారు.దాని కోసం ఎన్ని ప్రయత్నాలైన చేస్తూ ఉంటారు.

అలాగే ఖరీదైన కాస్మొటిక్స్ వాడుతూ ఉంటారు.ఆలా కాకుండా మన పూర్వీకుల కాలం నుండి ఉపయోగిస్తున్న నువ్వుల నూనెను ఉపయోగించి ఎన్నో అద్భుతాలను చేయవచ్చు.

చర్మ సమస్యలకు అద్భుతమైన రహస్యమైన నూనె….ఏమిటో తెలుసా-Telugu Health-Telugu Tollywood Photo Image

ఇప్పుడు ముఖం మీద నువ్వుల నూనె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో తెలుసుకుందాం.

అరస్పూన్ నువ్వుల నూనెలో ఒక విటమిన్ E క్యాప్సిల్ ఆయిల్ ని వేసి బాగా కలిపి ముఖానికి రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మానికి పోషణ ఇచ్చి చర్మం మెరిసేలా చేస్తుంది.

ఒక స్పూన్ బాదం నూనెలో అరస్పూన్ నువ్వుల నూనెను కలిపి ముఖానికి రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే చర్మ కణాలు జీవం కలిగి మృదువుగా మారుస్తుంది.

అరస్పూన్ నువ్వులనూనెలో రెండు చుక్కలు రోస్ మేరీ సుగంధ నూనెను కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే బ్లాక్ హెడ్స్ తొలగించటంలో బాగా సహాయపడుతుంది.

అరస్పూన్ నువ్వులనూనెలో అరస్పూన్ కలబంద తాజా జెల్ ని కలిపి ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి.ఇలా చేయటం వలన ముఖం మీద మచ్చలు తగ్గి చర్మం రంగు అంతా ఒకేలా ఉండేలా చేస్తుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sesameoil Skin Benefits Related Telugu News,Photos/Pics,Images..