డార్క్ లిప్స్‌ను నివారించే నువ్వుల నూనె..ఎలాగంటే?

ఒక్కోసారి లిప్స్ న‌ల్ల‌గా మారిపోతుంటాయి.ఆహార‌పు అల‌వాట్లు, శ‌రీరంలో వేడి పెర‌గ‌డం, స్మోకింగ్‌, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకు పోవ‌డం, ఏదైనా అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టం.

 Sesame Oil Helps To Get Rid Of Dark Lips! Sesame Oil, Dark Lips, Sesame Oil For-TeluguStop.com

ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల లిప్స్ న‌ల్ల‌గా మారిపోతాయి.దీంతో ఈ డార్క్ లిప్స్‌ను వ‌దిలించుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే డార్క్ లిప్స్ ను సులువుగా నివారించ‌డంలో నువ్వుల నూనె అద్బుతంగా స‌హాయ‌ప‌డుతుంది.మ‌రి నువ్వుల నూనెను లిప్స్‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల నువ్వుల నూనె, ఒక స్పూన్ షుగ‌ర్ వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.

మెల్ల మెల్ల‌గా రెండు లేదా మూడు నిమిషాల పాటు స్క్ర‌బ్ చేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో శుభ్రంగా లిప్స్‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల మృత క‌ణాలు, మురికి పోయి.లిప్స్ ఎర్ర‌గా మార‌తాయి.

అలాగే ఒక బౌల్‌లో కొద్దిగా నూనెల నూనె మ‌రియు ఎండ బెట్టి పొడి చేసుకున్న బీట్ రూట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత పెదాల‌పై ఈ మిశ్ర‌మాన్ని పూయాలి.

ప‌దిహేను నిమిషాల పాటు డ్రై అవ్వ‌నిచ్చి.అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే డార్క్ లిప్స్ దూరం అవుతాయి.

Telugu Beautiful Lips, Tips, Benefitssesame, Dark Lips, Lip Care, Lips, Sesame O

ఇక ఒక బౌల్‌లో ఒక స్పూన్ నువ్వుల నూనె, ఒక స్పూన్ నిమ్మ ర‌సం వేసి క‌లుపు కోవాలి.ఇప్పుడు దూది సాయంతో ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌పై అద్దు కోవాలి.ఆరిపోయే వరకు అలాగే ఉంటే.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో లిప్స్‌ను వాష్ చేసుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే డార్క్ లిప్స్ ఎర్ర‌గా, అందంగా మార‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube