సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు షాకిచ్చిన వైట్‌హౌస్.. ?

కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్లను తయారు చేసిన సంస్దల్లో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్ద కూడా ఒకటన్న సంగతి తెలిసిందే.ఇక మనదేశం తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్లను దేశం నలుమూలలకు కేంద్ర ప్రభుత్వం పంపించింది.

 Serum Institute Of India Shocked By America White House About Covid Vaccine , Am-TeluguStop.com

ఇందువల్ల ప్రస్తుతం మనదేశంలో ఈ టీకాల కొరత ఏర్పడిందన్న వాదన వినిపిస్తుంది.

ఇకపోతే కరోనాను కట్టడికి ఉపయోగించే వ్యాక్సిన్ల ముడిసరుకులపై నిషేధం ఎత్తివేయాలన్న సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (సీఐఐ) ప్రతిపాదనకు వైట్‌హౌస్ నో చెప్పిందనే ప్రచారం జరుగుతుంది.

కాగా ఈ అంశం పై ఇప్పటికే పలుమార్లు యూఎస్ మీడియా ప్రతినిధులు వైట్‌హౌస్ ప్రతినిధులను ప్రశ్నించినా వారి నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని తెలుస్తుంది.

ఇదే విషయం పై యూఎస్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ డైరెక్టర్ డాక్టర్ అంథోని ఫాసి, వైట్‌హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ ఆండీ స్లాసిట్‌లను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ఐయామ్ సారీ.

దాని గురించి మేం మీకు మళ్లీ చెబుతాం.ఇంతకు మించి నాకు తెలియదు.

అనే పదాలు మాత్రమే వెల్లడించారని అంటున్నారు.

ఇదిలా ఉండగా భారత్ లో కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అమెరికా నుంచి వస్తున్న ముడి సరుకులపై నిషేధం ఎత్తివేయాలని సీరం ఇనిస్టిట్యూట్ అధినేత అదర్ పూనావాలా అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను ఇదివరకే కోరిన విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube