మాజీ హోంమంత్రికి సీరియస్.. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ !  

Naini Narasimhareddy, trs, telangana ex home minister, hyderabad , icu ,City Neuro Center in Banjara Hills,neumonia - Telugu City Neuro Center In Banjara Hills, Hyderabad, Icu, Naini Narasimhareddy, Neumonia, Telangana Ex Home Minister, Trs

మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.ఊపిరితిత్తుల ఇన్ ‌ఫెక్షన్‌, న్యుమోనియాతో ఆయన జూబ్లీహిల్స్‌ ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి.

TeluguStop.com - Serious To Former Home Minister Naini Narasimhareddy

సెప్టెంబర్ 28న నాయిని నరసింహారెడ్డి కరోనా సోకింది.అప్పటి నుంచి ఆయన హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు.

ఎప్పుడు యాక్టీవ్ గా, శారీరకంగా స్ట్రాంగ్ గా కనిపించే నాయిని వారం క్రితం మరో సారి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటీవ్ కూడా వచ్చింది.ఆ తరువాత పూర్తిగా కరోనా నుండి కోలుకొని ఇంటికి వెళ్లారు.

TeluguStop.com - మాజీ హోంమంత్రికి సీరియస్.. వెంటిలేటర్ పై ట్రీట్మెంట్ -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అయితే , ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆయనను మరోసారి పరీక్షించగా.ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ న్యుమోనియా సోకినట్లు వైద్యులు తెలిపారు.దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి.ఆస్పత్రిలో పల్మనాలజీ స్పెషలిస్టు డాక్టర్ సునీతారెడ్డి, కిడ్ని స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్ లు నాయినికి వైద్యం అందిస్తున్నారు.

ప్రస్తుతం నాయినిని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

నాయిని నరసింహారెడ్డి భార్య అహల్య సైతం కరోనా బారిన పడ్డారు.

దీంతో ఆమె సైతం బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందుతున్నారు.ప్రస్తుతం నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు నెగటీవ్ వచ్చిందని సమాచారం.

నాయిని అల్లుడు, రాంనగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఆయన పెద్ద కుమారుడికి సైతం కరోనా సోకింది.

.

#Neumonia #TelanganaEx #CityNeuro #Hyderabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Serious To Former Home Minister Naini Narasimhareddy Related Telugu News,Photos/Pics,Images..