కళ్లతోనే నవరసాలు పలికిస్తున్న బుల్లితెర నటీమణులు ఎవరో తెలుసా?

ప్రస్తుతం వెండి తెరతో పోల్చితే బుల్లి తెరకే మస్త్ క్రేజ్ ఉంది.సినిమాల కంటే సీరియల్స్ నే ఎక్కువగా ఆదిరిస్తున్నారు జనాలు.

 Serial-heroines-who-are-very-expressive, Premi Viswanath, Preethi Nigam, Kavyasri, Mahi Gowthami, Anusri, Sirisha, Swathi Sharma, Jayaharika, Serial Heroines-TeluguStop.com

మధ్యాహ్నం నుంచి మొదలుకొని రాత్రి వరకు టీవీకి అతుక్కుపోయి సీరియల్స్ చూస్తున్న జనాలు ఎంతో మంది ఉన్నారు.అందం, అభినయంతో పాటు తమ అందమైన కళ్లతో అద్భుత భావాలు పలికిస్తూ జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు బుల్లితెర తారామణులు.

వారిలో కొందరు మాత్రం స్థాయికి మించిన నటనతో ఆకట్టుకుంటున్నారు.ఇంతకీ వారెవరో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Serial-heroines-who-are-very-expressive, Premi Viswanath, Preethi Nigam, Kavyasri, Mahi Gowthami, Anusri, Sirisha, Swathi Sharma, Jayaharika, Serial Heroines-కళ్లతోనే నవరసాలు పలికిస్తున్న బుల్లితెర నటీమణులు ఎవరో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగు బుల్లితెపై బాగా పాపులర్ అయిన సీరియల్ కార్తీకదీపం.స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో వంటలక్క పాత్రతో ఎంతో ఆకట్టుకుంటుంది ప్రేమీ విశ్వనాథ్.

కోపాన్ని, నవ్వుని ఎమోషన్ ని కళ్లతో చక్కగా పలికిస్తుంది.అటు ప్రీతి నిగమ్ నెగెటివ్ రోల్స్ లో చేస్తూ అద్భుత నటన చూపిస్తుంది.తన కళ్లతోనే ఎన్నో భావాలను పలికిస్తుంది.జీ తెలుగులో ప్రసారం అయ్యే మిఠాయికొట్టు చిట్టెమ్మ సీరియల్ బాగా ఫేమస్ అవుతుంది.

ఇందులో అంజన ఎంతో చక్కగా నటిస్తుంది.తన కలువల్లాంటి కళ్లతో అనేక భావాలను పలికిస్తుంది.

అటు త్రినయని సీరియల్ లో యష్క పదుకొనే.ఈటీవీలో వచ్చే అభిషేకం, మాటీవీలో రాధామధు వంటి సీరియల్స్ లో విశాల సైతం కళ్లతోనే నవరసాలు పలికిస్తున్నారు.

శ్రావణ సమీరాలు లో నటించిన నవీన, మనసుమమత, పద్మవ్యూహం సీరియల్స్ లో నటిస్తున్న అస్మిత సైతం తన అందమైన కళ్లతో ఆకట్టుకుంటుంది.ప్రేమ ఎంత మధురం సీరియల్ లో మీరా పాత్ర చేస్తున్న అనుశ్రీ, నాపేరు మీనాక్షి సీరియల్ లో దీపగా నటిస్తున్న వీణ సైతం తమ కళ్ళతో ఆకట్టుకుంటున్నారు.

Telugu Anusri, Jayaharika, Kavyasri, Mahi Gowthami, Preethi Nigam, Premi Viswanath, Serial, Sirisha, Swathi Sharma-Telugu Stop Exclusive Top Stories

స్టార్ మాలో వచ్చే గోరింటాకు సీరియల్ లో శ్రీవల్లీగా నటిస్తున్న కావ్యశ్రీ, నీవల్లే నీవల్లే సీరియల్ లో హీరోయిన్ చేస్తున్న మహీ గౌతమీ అందమైన కళ్ళతో కట్టిపడేస్తున్నారు.చెల్లెలి కాపురం సీరియల్ లో నటిస్తూ తన చక్కని కళ్ళతో మరపిస్తోంది శిరీష వల్లభనేని.ఈటీవీ అమ్మ సీరియల్ లో అవని పాత్ర పోషిస్తున్న స్వాతి శర్మ తన కళ్ళతోనే నటనను కనబరుస్తోంది.నేను శైలజ, పౌర్ణమి, చెల్లెలి కాపురం సీరియల్స్ లో నటిస్తున్న జయహారిక ఓవైపు పాజిటివ్, మరోవైపు నెగెటివ్ రోల్స్ లో నటించి మెప్పిస్తోంది.

హీరోయిన్ గా యాష్మి గౌడ నాగభైరవి సీరియల్ లో నటిస్తూ, అందమైన కళ్ళతో ఆడియన్స్ ని కట్టిపడేస్తోంది.హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ లో అమాయకంగా నటిస్తున్న ప్రియా బాలకుమారన్ అలరిస్తోంది.

ఇదే సీరియల్ లో హిట్లర్ గారి ముగ్గురు కోడళ్లలో ఒకరిగా నటిస్తున్న జయ ధనుష్ తన కళ్ళతోనే మంత్రముగ్దుల్ని చేస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube