నటి శిరీషకు ఎంత మంది అక్కాచెల్లెళ్లు..వారంతా సీరియల్ హీరోయిన్స్

Serial Heroine Shirisha Unknown Facts , Shirisha, Sisters, Family Background, Unknown Facts, Untold Story, Tollywood Entry, Rajitha, Sowjanya, Mogalirekulu, Swathichinukulu, Movie Offers

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టు లు ఉన్నప్పటికీ చాలామంది ఇండస్ట్రీకి వచ్చి నటుడిగా స్థిరపడాలని కోరుకుంటూ ఉంటారు కానీ అందరికీ అవకాశం దొరకదు కొందరికి అవకాశం వచ్చినా ఎక్కువ కాలం అక్కడ నిలబడక పోవచ్చు అయితే చాలామంది ఇండస్ట్రీకి రావాలని ఆశ తో వచ్చి ఇక్కడ అవకాశాలు దొరక్క దొరికిన అవకాశాలతో గుర్తింపు లేకపోవడంతో చాలామంది బుల్లితెరపై తమదైన నటనని చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.అయితే చాలామంది సినిమాలో నటించే హీరో హీరోయిన్లు సైతం బుల్లి తెరపై నటించే వాళ్లకి ఉన్నంత క్రేజు మాకు ఉండదు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే టీవీలో వచ్చే సీరియల్స్ ని ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూస్తారు కాబట్టి సీరియల్స్ చేసే వాళ్లకు వ్యూయర్ షిప్ ఎక్కువగా ఉంటుంది అని ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు చాలామంది చాలా సార్లు చెప్పారు.

 Serial Heroine Shirisha Unknown Facts , Shirisha, Sisters, Family Background, Un-TeluguStop.com

అందుకే సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాక చాలామంది బుల్లి తెరపై నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన చాలామంది నటీమణులు వెండితెరపై అవకాశాలను కోల్పోయిన తర్వాత పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి బుల్లితెరపై నటిస్తున్నారు.రాధిక, రమ్యకృష్ణ లాంటి వారు సైతం బుల్లితెరపై సీరియల్స్ లో నటిస్తున్నారు.

బుల్లితెరపై నటించే నటీమణులు చాలామంది ఉన్నప్పటికీ ముఖ్యంగా మనం నటి శిరీష గురించి చెప్పుకోవాలి.

శిరీష సిరిసిల్ల లో పుట్టింది తండ్రి పేరు పాపయ్య శిరీష కి ఇద్దరు అక్కలు రజిత, సౌజన్య.

రజిత కూడా 16 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుని ఆ తర్వాత తన భర్త ప్రోత్సాహంతో దూరదర్శన్ లో అడుగుపెట్టి కొన్ని సీరియల్స్ లో నటించింది ఆ తర్వాత సౌజన్య కూడా అక్క బాటలోనే నడిచి కొన్ని సీరియల్స్ చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.అందరికంటే చిన్నమే అయిన శిరీష మాత్రం వరుసగా సీరియల్స్ చేస్తూ బుల్లితెరపై స్టార్ నటిగా ఎదిగిపోతుంది మొదట్లో చిన్న చిన్న సీరియల్స్ చేసినప్పటికీ మొగలిరేకులు సీరియల్ లో నటించిన పాత్ర కి మంచి గుర్తింపు లభించింది.

మొగలిరేకులు సీరియల్ లో చేసిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు లభించింది ముఖ్యంగా హీరో గా నటించిన సాగర్ కి సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి ప్రభాస్ హీరోగా కాజల్ హీరోయిన్ గా వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించి మంచి గుర్తింపును సాధించారు ఆ తర్వాత హీరోగా కూడా నటించి సక్సెస్ అయ్యాడు.

Telugu Background, Mogalirekulu, Offers, Rajitha, Shirisha, Sisters, Sowjanya, S

అలాగే శిరీష కూడా మొగలిరేకులు సీరియల్ చేసిన తర్వాత వెనుతిరిగి చూడకుండా వరుసగా సీరియల్స్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటివరకు తను మొగలిరేకులు, స్వాతిచినుకులు,రాములమ్మ, మనసు మమత కాంచన గంగ, నాతిచరామి వంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించారు.సీరియల్స్ లో నటిస్తూ తనకంటూ స్టార్ స్టేటస్ ని క్రియేట్ చేసుకున్నారు.శిరీష షూటింగ్ స్పాట్ లో తన షూటింగ్ అయిపోయిన తర్వాత ఇతర నటీనటులతో చాలా బాగా మాట్లాడుతుంది అని ఎవరితో గొడవ పెట్టుకోకుండా తన పనేదో తను చూసుకుంటుందని ఆమె గురించి ఆమెతో పని చేసిన చాలామంది చాలా సార్లు చెప్పారు.

బుల్లితెరపై ఒక వ్యక్తి స్టార్ గా నిలవడం అనేది అంత ఆషామాషీ విషయం కాదు అలాంటిది ఆవిడ చాలా సీరియల్స్ లో నటిస్తూ ఖాళీ లేకుండా బిజీగా ఉంటుంది అంటే నిజంగా ఆవిడ హార్డ్ వర్క్ కి మనం మెచ్చుకోవాలి.ఎక్కడో సిరిసిల్ల లో ఉన్న ఒక పేద ఫ్యామిలీ నుండి వచ్చి తన నటనతో జనాలు అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube