హిందీ ప్రముఖ ఛానళ్లలో ప్రసారం అయ్యే పలు ధారావాహికలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ హీరోయిన్ “స్నేహ జైన్” గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకి పెద్దగా తెలియకపోయినప్పటికీ హిందీ మరియు మరాఠీ సినీ ప్రేక్షకులకు మాత్రం బాగానే గుర్తుంటుంది.అయితే తాజాగా నటి స్నేహ జైన్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.
ఈ క్రమంలో సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.
అయితే ఇందులో భాగంగా తాను డిగ్రీ చదువుకునేటప్పుడు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించానని ఈ క్రమంలో సౌత్ ఇండియా కి సంబంధించిన ఓ ప్రముఖ డైరెక్టర్ నుంచి తనకి కాల్ వచ్చిందని ఇందులో భాగంగా తాను తెరకెక్కిస్తున్న చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించే అవకాశం ఇస్తున్నానని దాంతో తన లేటెస్ట్ ఫోటోలు మరియు ఇతర వివరాలు తెలియజేయాలని అడిగాడట.
దీంతో స్నేహం ఆనందంతో ఉప్పొంగిపోయింది.అలాగే తన లేటెస్ట్ ఫోటోలను మరియు సినిమా డేట్ల సంబంధిత వివరాలను కూడా పంపించిందట.దాంతో ఆ డైరెక్టర్ తన ఫోటోలను చూసి షూటింగ్ నిమిత్తమై హైదరాబాద్ నగరానికి రమ్మని అనంతరం హైదరాబాద్ కి వచ్చిన తర్వాత తనని హోటల్ గదిలో ఉండాలని సూచించాడట.

అయితే ఆ డైరెక్టర్ మాటలు నమ్మి స్నేహ జైన్ తన తల్లితో కలిసి హైదరాబాద్ కి వెళ్లానని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఏకంగా పడకగది కమిట్మెంట్ అడిగాడని దాంతో వెంటనే అక్కడి నుంచి తన తల్లిని తీసుకొని మళ్ళీ ముంబై వెళ్లిపోయానని తెలిపింది.అంతేకాకుండా సినిమా అవకాశాల కోసం దిగజారిపోయి ప్రవర్తించాల్సిన అవసరం తనకు లేదని ఆ డైరెక్టర్ మొహం మీదే చెప్పిందట.
కానీ ఆ దర్శకుడు మాత్రం మళ్లీ వారం రోజుల తర్వాత కూడా ఫోన్ చేసి పడకగది కమిట్మెంట్ ఇస్తే సినిమా అవకాశం కచ్చితంగా ఇస్తానని కొంతమేర ఇబ్బంది పెట్టాడని, దాంతో తాను పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో మళ్ళీ ఆ డైరెక్టర్ తనకి ఫోన్ చేయలేదని చెప్పుకొచ్చింది.
కానీ తనని పడకగది కమిట్మెంట్ అడిగినటువంటి దర్శకుడు పేరు చెప్పడానికి మాత్రం స్నేహ జైన్ ఇష్టపడ లేదు.అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి స్నేహ జైన్ 2016 వ సంవత్సరంలో “కృష్ణదాసి” అనే గుజరాతి ధారావాహికలో నటించి తన సినీ కెరీర్ ని ప్రారంభించిన ఈ అమ్మడు ప్రస్తుతం ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ దూసుకుపోతోంది.