అందుకే ఆ సీరియల్ యాక్టర్ చెంప పగలగొట్టా....

తెలుగులో పలు సీరియళ్లు మరియు చిత్రాలలో నటించి వెండితెర ప్రేక్షకులను మరియు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి “రిషిక” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే రిషిక అవకాశాల కోసం సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో మోడలింగ్ రంగంలో కొంతకాలం పాటు పని చేసింది.

 Serial Actress Rishika Clash With Her Co Actress In Serial Industry-TeluguStop.com

ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లో ఆఫర్లు రావడంతో అందులో కూడా నటించింది.కానీ ఆ చిత్రాలు పెద్దగా కలిసి రాకపోవడంతో చివరికి సీరియల్ రంగంలో సెటిలైంది.

కాగా తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తాను సీరియల్ రంగంలోకి ఎలా వచ్చాననే విషయంపై పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకుంది.

 Serial Actress Rishika Clash With Her Co Actress In Serial Industry-అందుకే ఆ సీరియల్ యాక్టర్ చెంప పగలగొట్టా….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా తన చదువు పూర్తయిన తర్వాత మోడలింగ్ రంగంలో పనిచేయాలని ఉండేదని అందువల్లనే కొంత కాలం పాటు మోడలింగ్ రంగంలో పని చేశానని చెప్పుకొచ్చింది రిషిక.

ఆ తర్వాత అనుకోకుండా తెలిసిన వారి ద్వారా సినిమాల్లో నటించే అవకాశాలు రావడంతో అందులో కూడా నటించానని కానీ ఆ చిత్రాలేవీ తనకు కెరీర్ పరంగా పెద్దగా ఉపయోగపడలేదని తెలిపింది.ఆతరువాత తెలుగులో ప్రముఖ సీరియల్ నటుడు ప్రభాకర్ హీరోగా నటించిన “అన్నా చెల్లెలు” అనే సీరియల్ ద్వారా తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టానని తెలిపింది.

ఆ తర్వాత దాదాపుగా పదికి పైగా సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నానని అందువల్లనే మళ్ళీ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించ లేదని చెప్పుకొచ్చింది.

అయితే ఈ లోకంలో ఆడ వాళ్ళకి ఆడవాళ్లే శత్రువులుగా ఉంటారని మనం ఎదుర్కొంటున్న సందర్భాలను బట్టి ఒక్కోసారి అర్థమవుతుందని కూడా తెలిపింది.

కాగా ఆ మధ్య తాను ఓ సీరియల్ లో నటిస్తున్న సమయంలో తనతో పాటు అదే సీరియల్ లో నటిస్తున్న సహ నటి తనతో కొంత మేర అసభ్యకరంగా ప్రవర్తించిందని అందువల్లనే సీరియల్ సెట్లోనే ఆమె చెంప పగలగొట్టానని కూడా తెలిపింది.ఈ విషయం ఇలా ఉండగా గతంలోరిషిక  నాకైతే నచ్చింది, బిల్లా రంగా, గంగా సాగర్ తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.

కానీ ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.దీంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా గుర్తింపు లభించకపోవడంతో సీరియల్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది.

కరోనా గమనిక : బయటికి వెళ్లే సమయంలో మాస్కు తప్పకుండా ధరించండి.అలాగే నిత్యం చేతులను శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోండి.మీతో పాటూ మీ కుటుంభ సభ్యులను కూడా సురక్షితంగా ఉంచండి.–  తెలుగుస్టాప్.కామ్ యాజమాన్యం

.

#Rishika #SerialActress #TeluguSerial #RishikaClashes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు