అతనితో లవ్ బ్రేకప్.. చచ్చేట్టు కొట్టానని అంటున్న నవ్య స్వామి..!

బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి.తన నటనతో, అందంతో బుల్లితెర ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

 Serial Actress Navya Swamy About Her Breakup, Navya Swamy, Alitho Saradagaa Show-TeluguStop.com

ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి సీరియల్ తో మరింత అభిమానాన్ని సొంతం చేసుకుంది.ఈ సీరియల్ లో మీనాక్షి పాత్ర లో నవ్య స్వామి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తొలిసారిగా తను కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెర పరిచయమైంది.ఆ తర్వాత తమిళంలో వాణి రాణి సీరియల్ లో నటించి తన నటనకు మంచి పేరు సంపాదించుకుంది.

ఇక ఆ తర్వాత నే తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నా పేరు మీనాక్షి సీరియల్ తో పరిచయమైంది.అంతేకాకుండా స్టార్ మా లో ప్రసారమైన ఆమె కథ సీరియల్ లో కీలక పాత్రలో నటించింది.

కానీ సీరియల్ అతి తక్కువ సమయంలోనే ముగిసింది.


ఇక ఈ సీరియల్ నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ రవి కృష్ణ తో ప్రేమలో ఉన్నట్లు తెగ వార్తలు కూడా వచ్చాయి.కానీ ఈ విషయాన్ని వాళ్ళు పలు ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అవి పుకార్లని తోసిపుచ్చారు.ఇదిలా ఉంటే తాజాగా తను ఆలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొనగా.

దానికి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.అందులో తన గురించి కొన్ని విషయాలు పంచుకున్న నవ్య స్వామి.

ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ సందడి చేసింది.

అంతేకాకుండా ఆలీ తన బ్రేక్ అప్ గురించి ప్రశ్నించగా.

తాను ప్రేమలో ఉన్న విషయాన్ని ఒప్పుకుంది నవ్య స్వామి.కానీ అది వర్కౌట్ కాకపోవడంతో బ్రేకప్ చేశానని తెలిపింది.

అంతే కాకుండా కాస్త ఎమోషనల్ గా కూడా ఫీల్ అయ్యింది నవ్య.ఇక తన కెరీర్ మొదట్లో ఒక ఈవెంట్ మేనేజర్ తో గొడవ జరిగిన విషయాన్ని తెలిపింది.

అతన్ని చచ్చేటట్టు కొట్టానని తెలిపింది.ఇక ఎందుకు కొట్టిందో తెలియక పోగా మొత్తం ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube