కారుతో బైక్ ని ఢీ కొట్టిన సీరియల్ నటి లహరి అరెస్ట్!

Serial Actress Lahari Who Collided With A Bike With Her Car At Shamshabad

ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్ లు ఎక్కువగా జరుగుతున్నాయి.కరోనా సమయంలో పూర్తిగా తగ్గిపోయిన ఈ రోడ్డు ప్రమాదాలు, ప్రస్తుతం మళ్లీ మొదటికి చేరుకున్నాయి.

 Serial Actress Lahari Who Collided With A Bike With Her Car At Shamshabad-TeluguStop.com

రోజుకు రోడ్డు ప్రమాదాల వల్ల కొన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.అయితే ఈ రోడ్డు ప్రమాదాలకు కేవలం సాధారణ వ్యక్తులే కాకుండా సినీ సెలబ్రిటీలు సైతం గురవుతున్నారు.

ఇది ఇలా ఉంటే ప్రముఖ సీరియల్ నటి లహరి అరెస్ట్ అయ్యింది.శంషాబాద్ రింగ్ రోడ్డు పై ప్రైవేట్ పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తి తన విధులు నిర్వహించుకొని శంషాబాద్ వైపు వస్తుండగా ఇంతలో సీరియల్ నటి లహరి కారు వచ్చి అతనిని ఢీకొట్టింది.

 Serial Actress Lahari Who Collided With A Bike With Her Car At Shamshabad-కారుతో బైక్ ని ఢీ కొట్టిన సీరియల్ నటి లహరి అరెస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ప్రమాదంలో పెట్రోలింగ్ వాహనం నడిపే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.ప్రమాదం జరిగిన వెంటనే చుట్టుపక్కల జనం గుమిగూడిన కూడా యాక్సిడెంట్ చేసిన లహరి మాత్రం కారులో నుంచి బయటకు దిగలేదు.

దీనితో వాహనదారులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటుగా నటి లహరిని కూడా పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Telugu Lahari, Vehicle, Road, Serial Actress, Serialactress, Shamshabad, Shamshabad Road-Movie

లహరి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న గృహలక్ష్మి సీరియల్ లో శృతి పాత్రలో నటిస్తోంది.చాలా సంవత్సరాల నుంచి ఈమె సీరియల్స్ లో నటిస్తూనే ఉంది.ఈటీవీ, జీ తెలుగు, మా టీవీలో ప్రసారమయ్యే పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన విషయాలను వెల్లడిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

#Lahari #Actress Lahari #Shamshabad #Serial Actress #Vehicle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube