ఇద్దరు పిల్లలున్న హీరోయిన్ కి మళ్లీ పెళ్లి... నెటిజన్లు దారుణంగా...  

Serial Actress Kamya Punjabi Second Marriage News-kamya Punjabi Actress News,kamya Punjabi Marriage News,kamya Punjabi News,serial Actress Kamya Punjabi

సాధారణంగా జీవితంలో తోడు కోరుకునే వారికి వయసుతో సంబంధం లేకుండా ఒంటరిగా ఉన్న వారు తమకంటూ ఒక జీవిత భాగస్వామిని ఏర్పరుచుకోవడంలో ఎటువంటి తప్పులేదు అంటుంటారు కొందరు.అయితే తాజాగా పంజాబీ భాషలో బుల్లి తెర పై అలరించేటువంటి కామ్య పంజాబీ రెండో పెళ్లి చేసుకున్నారు.

Serial Actress Kamya Punjabi Second Marriage News-Kamya News Kamya

అయితే ఈ పెళ్లికి సంబంధించినటువంటి ఫోటోలను కామ్య తన అభిమానులతో సోషల్ మీడియా మాధ్యమం ద్వారా పంచుకున్నారు.అయితే ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఆమె పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

మీకు ఇదివరకే పెళ్లయి దాదాపుగా 12 సంవత్సరాలు కలిగినటువంటి ఓ కూతురు కూడా ఉంది. మళ్లీ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడం ఏంటని వ్యక్తిగతంగా వివాదాస్పద కామెంట్స్ చేశాడు.

దీంతో కామ్య  పంజాబీ స్నేహితురాలు అయినటువంటి కవితా కౌషిక్ ఈ కామెంట్ పై స్పందించారు.ఇందులో భాగంగా ఇలాంటి కామెంట్లు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని అంతేగాక ప్రతి ఒక్కరి జీవితంలోనూ భార్యాభర్తలే ఒకరికొకరు జీవితాంతం వరకు తోడుగా ఉంటారని అన్నారు.

అలాగే పిల్లల్ని కనడంతోనే జీవితం అయిపోదని తమకంటూ అండగా జీవితాంతం ఒక తోడు కావాలని కాబట్టి ఇలాంటి వాటిపై వేలెత్తి చూపకుండా మీరు కూడా ఆనందంగా గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు.

దీంతో కొందరు నెటిజన్లు కామ్యా పంజాబీకి మద్దతుగా నిలుస్తున్నారు.అంతేగాక గతాన్ని మరిచిపోయి సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరి జీవితంలోనూ విషాదాలు ఉంటాయని కానీ అవన్నీ మరచి ముందుకు సాగితేనే జీవితం బాగుంటుందని సూచిస్తున్నారు.మరికొందరు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ జీవితాంతం తన భర్తతో ఆనందంగా కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.

తాజా వార్తలు