ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడంటున్న సీరియల్ నటి!- Serial Actress Jayalalitha Said Her Sad Marriage Life Secrets

serial actress jayalalitha, marriage life, secrets of life, prema yentha madhuram serial, serial actress jayalalitha about her marriage life - Telugu Marriage Life, Prema Yentha Madhuram Serial, Secrets Of Life, Serial Actress Jayalalitha, Serial Actress Jayalalitha About Her Marriage Life

ఒకప్పటి సినీనటి, ప్రస్తుతం సీరియల్ నటి జయలలిత.ఒకప్పుడు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న జయలలిత తెలుగులోనే కాకుండా మలయాళం లో కూడా నటించింది.

 Serial Actress Jayalalitha Said Her Sad Marriage Life Secrets-TeluguStop.com

దాదాపు వందకు పైగా సినిమాల్లో నటించి తనదైన శైలిలో పేరు తెచ్చుకుంది.అంతేకాకుండా కొన్ని సినిమాల్లో ప్రధాన పాత్రలో కూడా నటించింది.

కాగా ఇటీవలే తన జీవితంలో జరిగిన విషయం గురించి ప్రేక్షకులకు తెలిపింది.

 Serial Actress Jayalalitha Said Her Sad Marriage Life Secrets-ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడంటున్న సీరియల్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం జయలలిత ప్రేమ ఎంత మధురం సీరియల్ లో ఆర్య తల్లి శారదా దేవి పాత్రలో నటిస్తుంది.

ఇదివరకు మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా లో స్పీకర్ గా నటించిన సంగతి మనకు తెలిసిందే.కాగా ఇటీవలే ఇంటర్వ్యూలో పాల్గొన్న తన జీవితం గురించి, వ్యక్తిగత విషయాల గురించి కొన్ని విషయాలు తెలిపింది.

తన 30 ఏళ్ల కెరీర్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని తెలిపింది.తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి వినోద్ తన ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడని తెలిపింది.తన భర్త బూతు సినిమాలతో పాటు భక్తి రస చిత్రాలు కూడా తీసేవారు అని తెలిపింది.అంతేకాకుండా తన భర్త డి గ్రేడ్ సినిమాలు కూడా చేసేవారని అందులో తానే హీరోయిన్ గా ఉండేదని తెలిపింది.

వినోద్ తో తన ప్రేమ ప్రయాణం ఏడేళ్లు సాగిందని తెలిపింది.

ఏడేళ్ల తర్వాత అతనిపై ఆమెకు డౌట్ రాగా దూరం పెట్టాలనుకుంది.

కాగా అతడు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో పెళ్లి చేసుకున్నామని తెలిపింది.కాగా ఆమెకు వచ్చిన డౌట్ ఆరు నెలలకే బయటపడిందని తెలిపింది.

తన భర్త తన ఆస్తి కోసం పెళ్లి చేసుకొని అప్పులు తీర్చుకున్నాడని తెలిపింది.కాగా తన పెళ్లి అతనితో జరగడం జయలలిత వాళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదని తెలిపింది.

#Marriage Life #Secrets Of Life #SerialActress #PremaYentha #SerialActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు