ఫోన్ నంబర్ అడిగితే ఈ సీరియల్ హీరోయిన్ అంత మాట అనేసిందేంటీ...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో సినీ సెలబ్రిటీలు యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తమకు సంబంధించిన సమాచారాలు మరియు ఫోటోలను ప్రేక్షకులతో పంచుకుంటూ అలరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

 Serial Actress Deepika Singh Hilarious Reply To Phone Number Asking Person, Seri-TeluguStop.com

తాజాగా తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే “ఈ తరం ఇల్లాలు” అనే ధారావాహిక లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్న సీరియల్ నటి “దీపికా సింగ్” ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో తాజాగా నటి దీపికా సింగ్ షేర్ చేసినటువంటి ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.

అయితే ఇంతకీ ఆ వీడియో లో ఏముందంటే ఓ వ్యక్తి దీపికా సింగ్ బీచ్ లో ఆడుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చి ఫోన్ నెంబర్ అడిగాడు.దీంతో దీపికా సింగ్ తన ఫోన్ నెంబర్ లోని మొదటి నాలుగు నెంబర్లు చెబుతూ సముద్రాన్ని చూపిస్తూ అలాగే అందులోకి వెళ్లి దూకమంటూ సరదాగా అందరినీ నవ్వించింది.

దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అంతేకాకుండా ఈ మధ్య కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అడుగుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారికి నటి దీపికా సింగ్ ఈ వీడియో తో బాగానే బుద్ధి చెప్పిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

Telugu Bollywood, Deepika Singh, Eetharam Illalu, Phonenumber, Serial, Serial Ac

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి దీపికా సింగ్ హిందీ బుల్లి తెర పై ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలో పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ అందాలు ఆరబోస్తూ ఫోటో లకి ఫోజ్ లు కూడా ఇస్తోంది.అంతేకాకుండా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే బోల్డ్ షో చేయడానికి కూడా వెనకాడనని ఆ మధ్య ఓ ఇంగ్లీష్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube