పెళ్లి చేసుకుంటానని చెప్పి సీరియల్ నటితో కోరికలు తీర్చుకున్నాడు... చివరికి...

ఈ మధ్య కాలంలో కొందరు తమ కోరికలను తీర్చుకొనేందుకు గానూ ఏకంగా ప్రేమ, పెళ్లి అనే పదాలను వాడుతూ యువతులను మోసం చేస్తున్నారు.కాగా తాజాగా ఓ బడా వ్యాపార వేత్త పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన కామ వాంఛలను తీర్చుకున్న తర్వాత మొహం చాటేయడంతో చివరికి చేసేదేమీ లేక యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను సంప్రదించిన ఘటన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెలుగు చూసింది.

 Serial Actress Cheated By Businessman In Mumbai-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలో 25 సంవత్సరాలు కలిగిన ఓ యువతి నివాసముంటోంది. అయితే ఆమె స్వగ్రామం వేరే అయినప్పటికీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ముంబైలో ఉంటోంది.

 ఈ క్రమంలో పలు హిందీ మరియు మరాఠీ ధారావాహికలలో చిన్న చిన్న పాత్రలలో కూడా నటించింది.అయితే ధారావాహికల  షూటింగులకు హాజరవుతున్న సమయంలో ముంబైకి చెందిన  ఓ ప్రముఖ వ్యాపార వేత్తతో పరిచయం ఏర్పడింది.

 Serial Actress Cheated By Businessman In Mumbai-పెళ్లి చేసుకుంటానని చెప్పి సీరియల్ నటితో కోరికలు తీర్చుకున్నాడు… చివరికి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడు కలిసి బయటికి వెళ్లడం మరియు భోజనాలు చేయడం వంటివి చేసేవారు.ఈ క్రమంలో వ్యాపార వేత్త సీరియల్ నటికి లవ్ ప్రపోజ్ చేశాడు.

దీంతో ఇద్దరి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగా ఆమె అతడి ప్రేమని అంగీకరించింది.దీంతో పెళ్లి కాకుండానే హద్దులు దాటింది.

ఇక అప్పుడే అసలు కథ మొదలైంది.

ఈ మధ్య సీరియల్ నటి తనని పెళ్లి చేసుకోమని తన ప్రియుడిని కోరడంతో ఏదో ఒక వంక చెబుతూ పెళ్లి విషయాన్ని దాటవేస్తూ వచ్చాడు.

దీంతో తాజాగా మరోమారు నటి తన ప్రియుడిని గట్టిగా నిలదీయడంతో పెళ్లి చేసుకోలేనని చెప్పేశాడట.దీంతో మోసపోయానని గ్రహించిన సీరియల్ నటి వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులను సంప్రదించి తనకు న్యాయం చేయాలని కోరింది.

అంతేకాక ఈ మధ్య కాలంలో కొందరు తమ కామ వాంఛలను తీర్చుకునేందుకు ప్రేమ పేరుతో అమ్మాయిలకి మాటలు చెబుతున్నారని కాబట్టి అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని తనలా ఎవరూ మోసపోవద్దని ఆవేదన వ్యక్తం చేసింది.

#HindiSerial #SerialActress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు