సీరియల్ హీరోయిన్ ని ఫోన్ నంబర్ అడిగిన నెటిజన్... దాంతో...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సినీ సెలెబ్రెటీలకు మరియు తమ అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది.దీనికితోడు ఈ మధ్య కొందరు సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహించడం, అలాగే లైవ్ కార్యక్రమాలు నిర్వహించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం వంటివి చేస్తుండడంతో ఇంటరాక్షన్ బాగా పెరిగింది.

 Serial Actress Bhavana Hard Reply To The Netizen, Serial Actress, Bhavana, Kalya-TeluguStop.com

దీంతో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలను తమ వ్యక్తిగత ప్రశ్నలను అడిగి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.అయితే తెలుగులో పలు చిత్రాలలో మరియు సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తెలుగు ప్రముఖ సీరియల్ నటి “భావన” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.

కాగా ఈ మధ్య కాలంలో నటి భావన సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలో తాజాగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.

అయితే ఇందులో భాగంగా ఓ నెటిజన్ ఏకంగా నటి భావన ఫోన్ నెంబర్ ని అడిగింది.దీంతో నటి భావన ఈ విషయం పై తనదైన శైలిలో స్పందిస్తూ సినీ నటుల ఫోన్ నెంబర్ ని ఇతరులకు ఇవ్వడం వల్ల కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అందువల్లనే తాను తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ని ఇవ్వలేనని సున్నితంగా నెటిజన్లకి తెలియజేసింది.

దీంతో కొందరు నెటిజనులు ఈ విషయంపై స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు కావాలని సినీ సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అడుగుతూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలాంటి వారికి నటి భావన సరిగ్గా సమాధానం చెప్పిందని అభినందిస్తున్నారు.

Telugu Bhavana, Netizenphone, Serial Actress, Serialactress, Zee Telugu-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి భావన తెలుగులో దాదాపుగా 100కి పైగా చిత్రాల్లో చిన్నాచితక పాత్రలలో నటించింది.కానీ ఈ పాత్రలు భావనకి గుర్తింపు తెచ్చి పెట్టలేక పోయాయి.కానీ ధారావాహికలలో మాత్రం పలు సెంటిమెంట్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి ప్రేక్షకులని బాగానే అలరించింది.

దీంతో నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది.దాంతో వెండి తెరపై కంటే బుల్లితెరపై ఎక్కువగా దృష్టి సారిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube