ఇడియట్స్, స్టుపిడ్స్ అంటూ డాక్టర్ బాబు కోపం.. కారణమేమిటంటే?

తెలుగు రాష్ట్రాల్లో సీరియళ్ల గురించి కనీస అవగాహన లేని వాళ్లకు సైతం కార్తీకదీపం సీరియల్ గురించి తెలిసే ఉంటుంది.గత కొన్నేళ్లుగా స్టార్ మా ఛానెల్ నంబర్ వన్ స్థానంలో కొనసాగడానికి కూడా ఈ సీరియలే కారణం.

 Serial Actor Nirupam Fires On Social Media Account Hackers, Serial Actor Nirupam-TeluguStop.com

ఈ సీరియల్ లోని వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.వంటలక్క పాత్రలో ప్రేమీ విశ్వనాథ్, డాక్టర్ బాబు పాత్రలో నిరుపమ్ నటించి ఈ సీరియల్ ను సూపర్ హిట్ చేశారు.
సీరియల్ లో ఎప్పుడూ వంటలక్కపై కోపాన్ని ప్రదర్శించే డాక్టర్ బాబుకు నిజ జీవితంలో కోపమొచ్చింది.నిరుపమ్ భార్య మంజుల పరిటాల మనకు సీరియల్ నటిగా సుపరిచితమే.

నిరుపమ్, మంజుల కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈటీవీ ఛానల్ లో ప్రసారమైన చంద్రముఖి సీరియల్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
అయితే తాజాగా మంజుల పరిటాల సోషల్ మీడియా ఖాతాను ఎవరో హ్యాక్ చేశారు.దీంతో నిరుపమ్ మంజుల ఖాతా హ్యాక్ అయిందని ఖాతాను రికవరీ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అనంతరం మంజుల స్నేహితుల, బంధువుల సహాయంతో తీవ్రంగా శ్రమించి చివరకు మంజుల సోషల్ మీడియా ఖాతాను రికవరీ చేయగలిగారు.ఖాతా రికవరీ అయిన తరువాత నిరుపమ్ సోషల్ మీడియాలో ఖాతా హ్యాక్ చేసిన వారిపై ఇడియట్స్ స్టుపిడ్స్ అంటూ ఫైర్ అయ్యారు.

కొందరు సైబర్ మోసగాళ్లు సోషల్ మీడియా ఖాతాల ద్వారా తప్పుదారి పట్టిస్తారని.సెలబ్రిటీల ఖాతాలను హ్యాక్ చేసి మిస్ గైడ్ చేస్తారని.

అలాంటి పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.మంజులపై అభిమానుల ప్రేమ ఇలాగే కొనసాగాలని పేర్కొన్నారు.

మంజులలా కొన్ని రోజుల క్రితం సినీ, రాజకీయ ప్రముఖుల ఖాతాలు సైతం హ్యాక్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube