సెప్టెంబర్ నెలలో పుట్టారా.... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు   September Born People Astrology And Personality     2018-01-31   21:41:53  IST  Raghu V

సెప్టెంబర్ నెలలో పుట్టినవారు ‘స్వయం కృషి’ తో ఎదగాలని కోరుకుంటారు. వారికీ మంచి భవిష్యత్ ఉంటుంది. వీరు కృషి,కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించటంలో సఫలం అవుతారు. అలాగే వీరు మంచి విషయాలను వినటానికి ఆచరించటానికి ఆసక్తి కనబరుస్తారు. ఏ పని చేసిన బాగా అలోచించి మాత్రమే చేస్తారు. వీరికి న్యాయవాదులు అన్నా న్యాయవాది వృతి అన్నా ఎనలేని గౌరవం ఉండటంతో న్యాయవాది వృత్తిని ఇష్టపడతారు.

వీరు ఇతరుల మాటను వినకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకోని ముందుకు సాగుతారు. తన ఇంటిని, ఇంటి వాతావరణాన్ని తనదైన శైలిలో ఉంచుకుంటారు. వీరికి చిన్నతనం నుండి కొన్ని కష్టాలు ఉంటాయి. ప్రేమ అనురాగాలు తక్కువగా ఉండుట వలన వీరి జీవితం అనుకున్న విధంగా సాఫీగా జరగదు. అంతేకాక కుటుంబంలో తరచుగా గొడవలు జరగటం వలన మానసికంగా,శారీరకంగా ఆందోళన ఎక్కువగా పడుతూ ఉంటారు.

వీరు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు మంచి అలవాట్లను కలిగి ఉంటారు. అయినా చెడు స్నేహాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వీరి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది. వీరి పరిస్థితి బాగోలేనప్పుడు ఇతరుల ప్రవర్తన కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. వీరు తీసుకొనే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలను పాటిస్తే చాలా మంచిది.

ఆరోగ్యము : వీరికి చర్మ వ్యాధులు, జ్వరం, ఊపిరితిత్తుల కు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ధనము : స్వయం కృషితో కష్టపడి ధనాన్ని సమకుర్చుకుంటారు.

లక్కీ వారములు: బుధవారం, శని వారం.

లక్కీ కలర్: తెలుపురంగు మరియు ఆకుపచ్చ.

లక్కీ స్టోన్: డైమండ్ మరియు గ్రీన్ కలర్ స్టోన్.