సెప్టెంబర్ 22వ తేదీ ఎంత స్పెషలో తెలుసా?

సినీ ఇండస్ట్రీలోకి ఎంతమంది నటులు వచ్చినా చిరంజీవి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే.నటనలోనూ, డ్యాన్స్ లోనూ, ఫైట్స్ లోనూ, డైలాగ్ డెలివరీలోనూ, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ లోనూ తనదైన మార్కును చూపిస్తూ దాదాపు మూడు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో చిరంజీవి నంబర్ 1 స్థానంలో కొనసాగారు.

 September 22 Is Very Special To Chiranjeevi  Megastar Chiranjeevi, Tollywood Her-TeluguStop.com

ప్రజారాజ్యం పార్టీ స్థాపన వల్ల సినిమాలకు ఆయన దూరమైన తరువాత ఆ నంబర్ స్థానం కోసం చాలామంది హీరోలు ప్రయత్నించినా ఎవరికీ ఆ స్థానం సొంతం కాలేదు.

దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి బ్రూస్ లీ సినిమాలో చిన్న పాత్రలో మెరిసి ఖైదీ నంబర్ 150 సినిమా ద్వారా రీఎంట్రీ ఇచ్చారు.

రీఎంట్రీలోనూ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు.ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నారు.

Telugu @kchirutweets, Bruce Lee, Khaidhi Number, Chiranjeevi, Pranam Khareedh, S

చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 అని మనందరికీ తెలిసిందే.అయితే చిరంజీవి ఆగస్టు 22 పుట్టినరోజైనా తాను నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు సెప్టెంబర్ 22 అని చెప్పుకొచ్చారు.చిరంజీవి హీరోగా మొదట పునాది రాళ్లు అనే సినిమాలో నటించినా మొదట రిలీజైన సినిమా మాత్రం ప్రాణం ఖరీదు.చిరంజీవి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 42 సంవత్సరాలు పూర్తయ్యాయి.

Telugu @kchirutweets, Bruce Lee, Khaidhi Number, Chiranjeevi, Pranam Khareedh, S

దీంతో చిరంజీవి తన సినీ ప్రయాణం గురించి ట్విట్టర్ వేదికగా స్పందించారు. నా తొలి చిత్రం ప్రాణం ఖరీదు సెప్టెంబర్ 22న విడుదలైందని.తనను ఇంతలా ఆదరించిన సినీ ప్రేక్షకులకు, అభిమానులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.చిరంజీవి చేసిన ట్వీట్ కు వేల సంఖ్యలో లైకులు వస్తున్నాయి.

సోషల్ మీడియాలో చిరంజీవి అభిమానులు చిరంజీవి 42 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి మెగాస్టార్ ను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube