భారీగా పతనమైన బంగారం ధర..!  

September 18 Th Gold Rate gold rate, silver rate, international market, india - Telugu Gold Rate, India, International Market, Silver Rate

బంగారం.భారతీయలకు ఎంతో ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.ఎక్కువ శాతం మంది బంగారంపైనే డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు.ఎందుకంటే బంగారం ధర భవిష్యుత్తులో పెరుగుతుంది కానీ తగ్గదు కాబట్టి.అందుకే బంగారంపైనే ఎక్కువ శాతం ఇన్వెస్ట్ చేస్తారు.అయితే ఇప్పుడు బంగారం ధరలు భారీస్థాయిలో పెరిగిపోయాయి.

TeluguStop.com - September 18 Gold Rate Decreased In India

ఒకటి కాదు రెండు కాదు ఈ కరోనా వైరస్ కాలంలో ఏకంగా 16 వేల రూపాయిల వరకు బంగారం ధర పెరిగింది.కరోనా వైరస్ కారణంగా ఇన్వెస్టర్లు అంత మిగితావాటిపై ఇన్వెస్ట్ చేసే దైర్యం లేక బంగారంపైనే ఇన్వెస్ట్ చేశారు.

దీంతో మరో నాలుగేళ్లలో పెరగాల్సిన బంగారం ధర ఇప్పుడే పెరిగింది.అయితే బంగారం ధర గత కొద్దీ కాలం నుంచి తగ్గుతూ వస్తుంది.

TeluguStop.com - భారీగా పతనమైన బంగారం ధర..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే బంగారం ధర రోజుకు 200, 300 రూపాయిలు తగ్గుతూ భారీ స్థాయిలో తగ్గుతూ వచ్చింది.కరోనా కారణంగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో బంగారం ధర భారీగా తగ్గుతూ వచ్చింది.

ప్రస్తుతం హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిల తగ్గుదలతో 53,550 రూపాయలకు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర 360 రూపాయిల తగ్గుదలతో 49,090 రూపాయలకు చేరింది.

ఇక వెండి ధర కూడా అంతే.

కరోనా వైరస్ కు ముందు 50 వేల రూపాయిలు ఉంటే 75 వేలకు చేరింది.అయితే ప్రస్తుతం అది కూడా తగ్గుతూ వచ్చి కేజీ బంగారం ధర 67,500 రూపాయిల వద్ద నిలిచింది.

అయితే బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు.విశాఖ, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,000 వద్ద కొనసాగుతుంది.

అయితే ఇలా బంగారం ధర తగ్గటానికి అగ్ర రాజ్యం అయిన అమెరికాలో కరోనా తగ్గుతుందని, అనుకున్న దాని కంటే అమెరికా చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతుందని, నిరుద్యోగ రేటు కూడా భారీ స్థాయిలో తగ్గిందని అందుకే బంగారం ధర తగ్గినట్టు మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

#Silver Rate #India #Gold Rate

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

September 18 Gold Rate Decreased In India Related Telugu News,Photos/Pics,Images..