ఆ ఆసుపత్రిలో హిందువులకి, ముస్లింలకి సెపరేట్ కరోనా వార్డులు...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇందులో భాగంగా వైద్యాధికారులు, పోలీసులు, పారిశుద్ధ కార్మికులు మరియు మరికొంతమంది సంబంధిత శాఖల అధికారులు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమిస్తున్నారు.

 Hindus, Muslims, Corona Virus, Treatment, Hospital, Nitin Patel, Gujarat, Deputy-TeluguStop.com

అయితే తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని అహమదాబాద్ నగరంలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించినటువంటి వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఓ ప్రముఖ వార్తా పత్రిక అహ్మదాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు వైద్య సదుపాయాలు కల్పించే విషయంలో హిందువులకు మరియు ముస్లింలకు వేర్వేరు వార్డులను ఏర్పాటు చేసినట్లు ప్రచురించింది.

అంతేగాక ఈ విషయాన్ని స్థానిక ఆస్పత్రికి చెందినటువంటి ఓ ప్రముఖ వైద్యాధికారి తెలిపాడని కూడా కథనంలో రాసింది.దీంతో నెటిజన్లు ఈ విషయాన్ని నెట్టింట్లో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

అంతేగాక ఈ విషయానికి ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా సమాధానం చెప్పాలంటూ సోషల్ మీడియా పరంగా ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి మరియు ఆరోగ్యశాఖ మంత్రి నితిన్ పటేల్ స్పందించారు.

స్థానిక ఆసుపత్రిలో ఇలా హిందువులకు, ముస్లింలకు వేర్వేరు వార్డులను ఏర్పాటు చేయడమనే అంశం తమ దృష్టికి రాలేదని ఎవరో కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కొట్టిపారేశారు.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు గుజరాత్ రాష్ట్రంలో 606 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గుర్తించగా ఇందులో 30 మంది మృతిచెందగా 59 మంది కోలుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube