కరోనా ఎఫెక్ట్ భారీగా నష్టపోయిన సెన్సెక్స్..!

భారత్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలేలా చేస్తున్నాయి.మార్కెట్ ఈరోజు ప్రారంభం నుండే నష్టాల్లోకి పడిపోయింది.

 Sensex Loses 1700 Points Corona Effect-TeluguStop.com

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,707 పాయింట్లు కోల్పోయి 47,883కి పడిపోయింది.నిఫ్టీ 524 పాయింట్లు నష్టపోయి 14,310 పడిపోయింది.

దేశీయ మార్కెట్ మీద కరోనా దెబ్బ గట్టిగానే పడినట్టు తెలుస్తుంది.ఈరోజు సెన్సెక్స్ నష్టాలను చూస్తే అందరు షాక్ అవుతున్నారు.

 Sensex Loses 1700 Points Corona Effect-కరోనా ఎఫెక్ట్ భారీగా నష్టపోయిన సెన్సెక్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బి.ఎస్.ఈ సెన్సెక్స్ లో ఇండస్ ఇండ్ బ్యాంక్ మైనస్ 8.60 % నష్టపోగా.బజాజ్ ఫైనాన్స్ -7.3 శాతం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -6.87 %, టైటాన్ కంపెనీ -5.24%, ఓ.ఎంజీ.సి -5.20% నష్టపోయింది.

బి.ఎస్.ఈ సెన్సెక్స్ లో డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ మాత్రమే 4.83 % వృద్ధి రేటు సాధించింది.మొత్తంగా ఈరోజు 1700 పాయింట్లకు పైగా సెన్సెక్స్ నష్టపోయింది.కరోనా తీవ్రత పెరగడం వల్ల మదుపరులు అమ్మకాలకే ఎక్కువ మొగ్గు చూపారు దాని వల్ల స్టాక్ మార్కెట్ నష్టాలపాలయ్యింది.

కరోనా తీవ్రత ఇలానే కొనసాగితే మాత్రం మార్కెట్ మరింత నష్టాల పాలయ్యే అవకాశం ఉందని అంటున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా సెకండ్ వేవ్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.

దీని ఎఫెక్ట్ మార్కెట్ పై పడుతుండటంతో అందరు టెన్షన్ పడుతున్నారు. మళ్లీ కరోనా తీవ్రత తగ్గి బిజినెస్ బగా నడిస్తేనే స్టాక్ మార్కెట్ కూడా లాభాలు వచ్చేలా ఉన్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు.

#1700 Points #Indian Market #Corona Effect #Sensex Loses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు