తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.ఊహించని రీతిలో నిందితులు బయటపడుతున్నారు.
ఈ వ్యవహారంలో అరెస్ట్ అయిన వారి సంఖ్య 50కి చేరింది.వ్యాపం కుంభకోణంలా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు మారుతోంది.
ఈ క్రమంలోనే టీఎస్పీఎస్సీ లావాదేవీల లెక్క లక్షలు దాటి కోటికి చేరిందని తెలుస్తోంది.ప్రవీణ్ కుమార్ మొదలు ఈ కేసులో నిందితులు అందరూ డబ్బుపై ఆశతో ఒకరి నుంచి మరొకరు క్వశ్చన్ పేపర్ ను అమ్ముకున్నారని సమాచారం.
ఇందులో భాగంగానే వరంగల్ లోని ఒక పరీక్షా కేంద్రంలో అభ్యర్థులు హైటెక్ కాపీయింగ్ కు పాల్పడ్డారని తెలుస్తోంది.కాగా ఈ కేసులో సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.