హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ( Shiva Balakrishna ) వాంగూల్మం నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.విచారణలో భాగంగా శివబాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్( IAS Aravindh Kumar ) పేరును ప్రస్తావించారని తెలుస్తోంది.
శివబాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ భవనాలకు అనుమతులు పొందారని సమాచారం.నార్సింగిలోని ఓ కంపెనీ వివాదాస్పద భూమికి శివబాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారని, ఐఏఎస్ అరవింద్ కుమార్ ఆదేశాలతోనే 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారని తెలుస్తోంది.
నార్సింగిలోని ఎస్ఎస్వీ ప్రాజెక్టు అనుమతి కోసం రూ.10 కోట్లను అరవింద్ కుమార్ డిమాండ్ చేశారని వాంగ్మూలంలో పేర్కొన్నారు.ఈ క్రమంలోనే రూ.10 కోట్లలో రూ.కోటిని షేక్ సైదా చెల్లించారని తెలుస్తోంది.ఈ నగదును శివబాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి అందజేశారని సమాచారం.
కాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు( ACB Officers ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.