కేసీఆర్ పాలనపై సంచలన సర్వే... అసలు విషయం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజుకో ట్విస్ట్ తో వేడెక్కుతున్న పరిస్థితి ఉంది.రెండు సార్వత్రిక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి  బలమైన ప్రతిపక్షం లేకపోవడంతో రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ చాలా సునాయాసంగా గెలిచిన సంగతి తెలిసిందే.

 Sensational Survey On Kcr Rule ... This Is The Real Thing Telangana Politics, Ts-TeluguStop.com

అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల మధ్య  పెద్ద ఎత్తున విమర్శల పర్వం కొనసాగుతోంది.అంతేకాక ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ  ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగేలా నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే తాజాగా కెసీఆర్ పరిపాలనపై సీ-ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో కెసీఆర్ పై 30 శాతం వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అయితే ప్రస్తుతం బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ తరువాత బలంగా ఉన్నందున ఆ పార్టీకే టీఆర్ఎస్ పార్టీ తరువాత అవకాశం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ సర్వేను కెసీఆర్ పరిశీలించే అవకాశం ఉంది.

మరి అసలు ఇంతలా 30 శాతం మంది వ్యతిరేకత రావడానికి గల కారణాలను విశ్లేషించే ఉంది.అయితే ప్రస్తుతం కెసీఆర్ పట్ల ప్రజలు అగ్రహంగా ఉన్న అంశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ లు ఒకటి.

ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ లు విడుదల చేస్తే ప్రజలు ఆగ్రహం చల్లారే అవకాశం ఉండడమే కాకుండా ముఖ్య మంత్రి కెసీఆర్ స్థాయి పెరిగే అవకాశం కూడా ఉంది.మరి రానున్న రోజుల్లో కెసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎంత వరకు ప్రజల ఆగ్రహాన్ని తగ్గించడానికి దోహదపడుతాయనేది చూడాల్సి ఉంది.

అంతేకాక ఈ సర్వేపై ఇంకా టీఆర్ఎస్ పార్టీ నేతలు ఎవరూ స్పందించలేదు.అయితే కెసీఆర్ ఇప్పటికే ప్రభుత్వ పనితీరుపై ప్రజల అభిప్రాయంపై తాజాగా ఒక సర్వే నిర్వహించుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube