గ్ర‌హాంత‌ర వాసుల విష‌యంలో సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డి..

చాలా ఏండ్లుగా కొనసాగుతున్న చిక్కుముడికి ఇంకా స‌మాధానం దొర‌క‌ట్లేదు.ప్ర‌పంచం అంతా దాని చుట్టూ ఎన్నో ఏండ్లుగా ప‌రిశోధ‌న‌లు జ‌ర‌పుతున్నా కూడా ఇంకా ఓ కొలిక్కి రావ‌ట్లేదు.

 Sensational Facts Revealed In The Case Of Aliens .., Aliens, Viral News , Viral-TeluguStop.com

అదే గ్ర‌హాంత‌ర వాసుల విష‌యం.అస‌లు ఈ సృష్టిలో మనిషి ఒక్క‌డే ఉన్నాడా లేదా ఇత‌ర గ్ర‌హాల మీదెవ‌రైనా జీవిస్తున్నారా అనే విష‌యం మాత్రం ఇంకా తెలియ‌ట్లేదు.

ఇప్ప‌టికే దీనిమీద ఎన్నో రూమ‌ర్లు వినిపిస్తున్నాయి.ఎన్నో సినిమాలు కూడా వ‌చ్చాయి.

అయితే ఇప్పుడు ఈ విష‌యంలో సంచ‌లన నిజాలు వెల్ల‌డ‌యిన‌ట్టు తెలుస్తోంది.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న టెక్నాల‌జీని బేస్ చేసుకుని ఇప్పుడు కొన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ప్ర‌స్తుతం ఖగోళ శాస్త్ర పరిశోధనల్లో భాగంగా ఓ సంచ‌ల‌న విష‌యం తెలిసింది.ప్ర‌స్తుతం అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన రేడియో యాంటెన్నా నెట్ వ‌ర్క్ మొత్తం నెదర్లాండ్స్ దేశంలో నిర్మిత‌మై ఉంది.

రీసెంట్ గా ఈ యాంటెన్నా 19 అరుణ మరుగుజ్జు నక్షత్రాల‌కు సంబంధించిన రేడియో సిగ్న‌ల్స్ ను క‌నిపెట్టిందంట‌.ఈ న‌క్ష‌త్రాల మూలంగా వ‌చ్చే సిగ్నళ్లను ఈ యాంటెన్నా లోతుగా అధ్య‌య‌నం చేసిన‌ట్టు చెబుతున్నారు సైంటిస్టులు.

Telugu Aliens, Dwarf Stars, Netharland, Radio Signals-Latest News - Telugu

వాస్త‌వానికి ఖ‌గోళంలో ఇంకా ఈ నక్షత్రాల చుట్టూ మ‌రేమైనా గ్రహాలు కూడా ఉండే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్టులు వెల్ల‌డిస్తున్నారు.ప్ర‌స్తుత సౌర కుటుంబ వ్యాప్తంగా వెల్ల‌డ‌వుతున్న ఈ త‌రంగాల ఆధారంగా మరిన్ని మ‌రుగుజ్జు న‌క్ష‌త్రాలు ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు సైంటిస్టులు.మ‌రి రాబోయే రోజుల్లో వీటిమీద ఇంకిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రిపి ఇంకేమైనా గ్రహాలు ఉంటే వాటి గురించి శక్తివంతమైన రేడియో తరంగాలను గుర్తించేందుకు ఈ యాంటెన్నాను డెవ‌ల‌ప్ చేస్తామంటున్నారు సైంటిస్టులు.ఈ సిగ్న‌ల్స్ కార‌ణంగా రాబోయే రోజుల్లో మ‌రిన్ని ప‌రిశోధ‌న‌ల‌కు ఆస్కారం ఉంటుంద‌ని చెబుతున్నారు.

చూడాలి మ‌రి భ‌విష్య‌త్‌లో ఏమైనా విష‌యాలు తెలుస్తాయో లేదో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube