బాలీవుడు ఖాన్ లపై వర్మ సెటైర్.. దీవాలికి ఖాన్స్ రిలీజ్ అంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతను ఒక వివాదాస్పద డైరెక్టర్.నిత్యం కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తూ కాంట్రవర్సి అంటేనే కేరాఫ్ అడ్రస్ గా రామ్ గోపాల్ వర్మ పేరు చెప్పవచ్చు.

 Sensational Director Ram Gopal Varma Satirical Tweet On Bollywood Khans Details,-TeluguStop.com

నిత్యం సోషల్ మీడియా వేదికగా వివాదాలతో కాపురం చేస్తూ వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన కేవలం సినిమాల గురించి మాత్రమే కాకుండా రాజకీయ విషయాలలో కూడా తలదూర్చి తనదైన శైలిలో ట్వీట్లు పెడుతూ మరిన్ని వివాదాలకు కారణమవుతుంటాయి.

ఇదిలా ఉండగా తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ తో మరొకసారి సంచలనంగా మారాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే సుమారు నాలుగు వారాల పాటు జైలులో ఉన్న ఆర్యన్ శనివారం విడుదలయ్యారు.ఇక ఈ విషయం పై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్ చేశారు.

ప్రతి ఏడాది దీపావళికి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఖాన్ ల సినిమాలు విడుదల అవుతాయి.ఈ ఏడాది కూడా దీపావళికి ఖాన్ విడుదల అయ్యాడు అంటూ కామెంట్ చేశారు.

అయితే ఈ ఏడాది డ్రగ్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ జైలు నుంచి విడుదల అయ్యాడని అతని పై తనదైన శైలిలో రామ్ గోపాల్ వర్మ సెటైర్లు వేశారు.ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో స్పందించిన పలువురు నటులు ఇంత కరెక్టుగా ఆలోచనలు మీకు ఎలా వస్తాయి సర్ అంటూ రీ ట్వీట్స్ చేస్తున్నారు.

ఇలా నిత్యం ఏదో ఒక విషయం ద్వారా వార్తలలో నిలబడే వర్మ కొండా సురేఖ దంపతుల గురించి బయోపిక్ చిత్రం తీస్తున్న సంగతి మనకు తెలిసిందే.మరి ఈ చిత్రం ద్వారా ఏ విధమైనటువంటి కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తారో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube