అమ్మ బాబోయ్ : ఆర్జీవీ ఐస్ క్రీమ్ తింటూ అషు రెడ్డి తో దాని గురించి మాట్లాడుతున్నాడట...

టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూ ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడుతూ లైఫ్ లీడ్ చేసేటువంటి డేరింగ్ మరియు దర్శకుడు “రామ్ గోపాల్ వర్మ” గురించి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ మధ్య కాలంలో రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ కోసం కొంత మంది యాంకర్లు తెగబడుతున్నారు.

 Sensational Director Ram Gopal Varma Focus On Bigg Boss Contestant Ashu Reddy-TeluguStop.com

అయితే ఇందుకు కారణాలు లేకపోలేదు.ఆ మధ్య ప్రముఖ యాంకర్ మరియు బిగ్ బాస్ కంటెస్టెంట్ అరియానా గ్లోరీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒకే ఒక ఇంటర్వ్యూ తో రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయింది.

అంతేకాకుండా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా అవకాశం కూడా దక్కించుకుంది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు పలురకాల షోలు, ఈవెంట్లతో బిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది.

కాగా ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఫోకస్ మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ పై పడినట్లు తెలుస్తోంది.అయితే ఆ బ్యూటీ ఎవరో కాదు యంగ్ హోస్ట్ అషు రెడ్డి.

అయితే ఈ అమ్మడు కూడా బిగ్ బాస్ షో ద్వారా బాగానే హైలెట్ అయ్యింది.కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలను మాత్రం అందుకోలేక పోయింది.

అయితే ఇటీవలే అషు రెడ్డి రామ్ గోపాల్ వర్మతో మీటింగ్ లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేసింది.అయితే ఇందులో ఏకంగా రామ్ గోపాల్ వర్మ అషు రెడ్డి తో ఐస్ క్రీమ్ తింటూ శృంగారం గురించి చర్చిస్తున్నానని క్యాప్షన్ పెట్టాడు.

దీంతో ఆర్జివి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.అంతేకాక ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఫోకస్ అషు రెడ్డి పైకి మారిందని కొందరు బోల్డ్ గా కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.కాగా ఇటీవలే ఓటిటి బిజినెస్ లో అడుగుపెట్టి స్పార్క్ ఓటిటి యాప్ ని ప్రమోట్ చేస్తూ తన చిత్రాలను విడుదల చేస్తున్నాడు.కానీ కానీ ఆశించిన స్థాయిలో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube