రహానెపై వేటు పడనుందా.. సెకండ్ టెస్టులో సంచలన నిర్ణయం?

ప్రస్తుతం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ కొనసాగుతోంది.విరాట్ కోహ్లీ తొలి టెస్టులో పాల్గొనకుండా విరామం తీసుకున్నారు.

 Sensational Decision In The Second Test Match About Rahane Rehane, Suspension,-TeluguStop.com

దాంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌కు సీనియర్ ప్లేయర్ అజింక్య రహానె కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.అయితే రహానె గత కొంత కాలంగా చాలా పేలవమైన ఆట ప్రదర్శనతో ప్రతిసారీ నిరాశ పరుస్తున్నాడు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండో టెస్టులో అతన్ని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువ అని తెలుస్తోంది.మొదటి టెస్టుకు దూరమైన కోహ్లీ రెండో టెస్టుకు మళ్ళీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

అప్పుడు టీమిండియా తుది జట్టు నుంచి ఎవరో ఒక ప్లేయర్ చోటు కోల్పోవాల్సిందే.ఆ ప్లేయర్ రహానె కానున్నారా? అని ప్రశ్నిస్తే విశ్లేషకుల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.రహానె టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.అతడి నాయకత్వంలో ఇప్పుడు భారత జట్టు గెలుపు వైపుగా పరుగులు పెడుతోంది.

ఇలాంటి పరిస్థితుల నడుమ రహానెని నిర్ధాక్షణ్యంగా తుది జట్టు నుంచి గెంటివేసే ధైర్యం టీమిండియా యాజమాన్యం చేస్తుందా? అనేదే అసలైన ప్రశ్నగా మారింది.

Telugu Zealand, Rehane, Secong, India, Matches-Latest News - Telugu

క్రికెట్ విశ్లేషకుల పరంగా చూసుకుంటే.రహానె రీసెంట్ గా ఆడిన 24 ఇన్నింగ్స్‌ల్లో ఒక్కసారీ కూడా సెంచరీ సాధించలేదు.ఈ 24 ఇన్నింగ్స్‌ల్లో కేవలం రెండంటే రెండే హఫ్ సెంచరీలు చేశాడు.

కీలక మ్యాచ్‌ల్లో రహానె ఆదుకుంటాడని జట్టు యాజమాన్యం అతడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా అతడు మాత్రం ఆశలన్నీ అడియాసలు చేశాడు.ప్రస్తుతం జరుగుతున్న టెస్టులో కూడా రహానె అత్యంత పేలవమైన పర్ఫామెన్స్ తో ప్ర

Telugu Zealand, Rehane, Secong, India, Matches-Latest News - Telugu

తి ఒక్కరిలోనూ అసంతృప్తిని రేకెత్తిస్తున్నాడు.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 35 చేసి రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు.దాంతో కష్టాల్లో ఉన్న జట్టుపై మరింత ఒత్తిడి పెరిగిపోయింది.

ఇక ఇదే మ్యాచ్‌లో శ్రేయస్‌ సెంచరీతో అందరి ప్రశంసలు దక్కించుకున్నాడు.దాంతో అతడిని కొనసాగించడం ఖాయంగా మారింది.

ఇప్పుడు రహానె లేదా పుజారాల్లో ఒకరిపై కచ్చితంగా వేటు పడే అవకాశం ఉంది.ఫామ్ పరంగా చూస్తే పుజారా రహానె కంటే స్ట్రాంగ్ గానే ఉన్నాడు.

అందువల్ల రహానెపై వేటు వేయడం న్యాయం కానీ పైనచెప్పిన కారణాల వల్ల అది జరుగుతుందో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube