'సారంగదరియా' పాటపై మొదలైన రచ్చ..సుద్దాల అశోక్ తేజ పై ఘాటు విమర్శలు..??

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల పంథా మారుతోంది.ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్లే ఇప్పుడు సినిమాలు, అందులోని పాటలను డిజైన్ చేస్తున్నారు మేకర్స్.

 Sensational Comments On Suddala Ashok Teja About Saranga Dhariya Song, Suddala A-TeluguStop.com

అలా ప్రస్తుతం యూట్యూబ్ లో సారంగదరియా అనే పాట మాత్రం ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంటూ.రికార్డ్ వ్యూస్ తో దూసుకెళ్తోంది.

గతంలో శేఖర్ కమ్ముల, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫిదా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వచ్చిన సారంగదరియా సాంగ్‌ అదరగొట్టేస్తోంది.

ఇప్పటికే 17 మిలియన్ల వ్యూస్ దాటి పోయింది.

అయితే ఈ పాట రచయిత సుద్దాల్ అశోక్‌ తేజపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

సుద్దాల అశోక్‌తేజ.ఓ జానపద గీతాన్ని తన పైత్యంతో చెడగొట్టాడని.

ఏవో నాలుగు వాక్యాలు రాసి ఈ పాట రచయితగా చెప్పుకుంటున్నాడని విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలో గుర్రం సీతారాములు అనే వ్యాస కర్త విమర్శిస్తూ…” సుద్దాల అశోక్‌ తేజా.

నా బిడ్డలు పాడిన పాటను అతుకుల బొంత జేసి కాక్ టైల్ డిజేలా చేస్తున్నావ్ ? తెలంగాణా బిడ్డ అని చెప్పుకొని తెలంగాణ అమరవీరుల మీద ఎన్ని పాటలు రాశావ్.? సారంగ దరియాలో సగం పాట నా అమ్మ అక్కలు తరాలుగా పాడారు పాడుకుంటున్నారు.నాలుగు తొడుగుల వాక్యాలు అతుకేసి మార్కెట్ లో అమ్ముకుని నన్ను జానపదం ఆవహించింది అంటావ్, అలా చెప్పుకోవడం అంత నీచం లేదు.

Telugu Love Story-Latest News English

నేను సైతం నేను సైతం అన్న పాట సగం కాపీ.దానికి జాతీయ అవార్డు ఇచ్చినవాడు ఎలాగో బుర్ర లేని వెధవ.ఏ ఒక్క రోజయినా ఆ పాట ప్రజా కవిత్వం పెట్టిన బిక్ష అన్నావా.? అది నీకయినా, శ్రీ శ్రీ కయినా.? పాటను సగం కొట్టేసినా ఒక్క విరసం నాయకుడూ అది తప్పు అని అన్నారో లేదో నాకు తెలియదు.కానీ మగధీర లో తన రెండు వాక్యాలు కొట్టేసి వాడుకున్నందుకు నిలదీసిన వంగపండుని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేసాడు అని కూస్తిరి.కలేకూరి, శివసాగర్, గద్దర్ పాటలు సినిమాలలో ఉన్నాయి అంటే దానికొక లక్ష్యం ఉంది.

ఉద్యమ రాజకీయాలకు ఆ పాటలు ఒక మద్దతు వాక్యాలు అయ్యాయి.మరి నువ్వేం చేస్తున్నావ్ గ్రంధ సాంగుడా అలియాస్ సారంగ దరుడా ?సారంగదరియా పాటను కాపీ కొట్టిన ‘కాపీ’ రాతగాడు, ‘కాఫీ’ సినిమా రాయుడు శేఖర్ కమ్ముల రేలా రే గాయనికి క్రెడిట్ ఇస్తారా ? యూ ట్యూబ్ క్లిక్స్ గొప్పలు చెప్పుకుంటారా.? ఏవిరా మీవల్ల ఈ పాటకి పరంపర కి ఒరిగింది ?.అంటూ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube