గాంధీభవన్ లో అభ్యర్థుల ఎంపిక చర్చపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను టీకాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవడం తెలిసిందే.

మే నెలలో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తిరుగులేని విజయం సాధించటంతో తెలంగాణలో కూడా అదే దిశగా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అడుగులు వేస్తూ ఉంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ నాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇంకా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే( Mallikarjun Kharge ) తెలంగాణలో పర్యటిస్తూనే ఉన్నారు.ఇదిలా ఉంటే తాజాగా గాంధీభవన్( Gandhi Bhavan ) లో అభ్యర్థుల ఎంపిక సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు.ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సమావేశంపై ఇప్పుడు రకరకాల వార్తలు వస్తున్నాయి.ఒకే కుటుంబానికి రెండు టికెట్ల విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి మధ్య వాదోపవాదాలు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది.

Advertisement

ఈ క్రమంలో ఈ సమావేశంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి( MLA Jaggareddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మూడు గంటల పాటు మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికలలో 65 నుండి 75 స్థానాలు గెలవగలమని చర్చించినట్లు తెలిపారు.ఇదే సమయంలో అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చిన దరఖాస్తులపై కూడా చర్చ జరిగింది.

పొత్తులపై ఇంకా చర్చ జరగలేదు.మరోసారి రేవంత్, బట్టి, ఉత్తమ్ చర్చిస్తారు.

పది రోజులలో అభ్యర్థులపై తుది నిర్ణయానికి వస్తారు అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు