ఏక్ నంబర్, దస్ నంబర్ అంటూ టీఆర్ఎస్ ముఖ్యనేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. !?

తెలంగాణాలో బిజేపీ తరపున ఎంపీగా బండి సంజయ్ గెలిచినప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ నేతల తప్పులను ఎండగడుతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టీఆర్ఎస్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

 Sensational Comments By Bandi Sanjay On Kcr And Ktr-TeluguStop.com

ఇదే క్రమంలో మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ, కీలక ప్రకటన చేశారు.కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను తప్పు దోవ పట్టించారని, వాటికి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించానని స్పీకర్‌ అనుమతి ఇస్తే, బీజేపీ అధిష్ఠానం అనుమతితో కేసీఆర్ బండారం బయట పెడతానని వ్యాఖ్యానించారు.

ఇదే కాకుండా కేసీఆర్ రాజకీయ స్వార్థం కోసమే పీవీని వాడుకుంటున్నారని, పీవీ ఘాట్‌ను ఎంఐఎం కూల్చుతామన్న సమయం లో కనీసం స్పందించలేదన్నారు.ఇకపోతే ప్రజలను మోసం చేయటంలో కేసీఆర్ ఏక్ నంబర్, కేటీఆర్ దస్ నంబర్ అంటూ ఎద్దేవా చేశారు బండి సంజయ్.

 Sensational Comments By Bandi Sanjay On Kcr And Ktr-ఏక్ నంబర్, దస్ నంబర్ అంటూ టీఆర్ఎస్ ముఖ్యనేతలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటేసి మళ్లీ పొరపాటు చేయొద్దని ఓటర్లను కోరారు సంజయ్.

#Ek Number #Bandi Sanjay #Das Number

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు