మోసానికి నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్.. కాంగ్రెస్ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ??

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మోసానికి, నిరంకుశ పాలనకు కేరాఫ్ కేసీఆర్ అని, ఆయన మంత్రి వర్గం కూడా ఈయన చెప్పించే వేదంగా భావిస్తారని విమర్శించారట.

 Telangana, Congress, Ponnala Laxmaiah, Sensational Comments, Kcr,congress Leader-TeluguStop.com

ఇదే కాకుండా సింగరేణి, విద్యుత్ సంస్థలు ఇచ్చిన ఉద్యోగాలు కూడా మీ ఖాతాలో వేసుకుంటారా.? అని ప్రశ్నించిన ఆయన 40 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించడం మీ పాలన లోని లోపాలకు నిదర్శమని విమర్శించారట.

ఇక మెట్రో కి 17,900 కోట్లు పెట్టాం అని చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రభుత్వం కేవలం లీజు కి భూములు ఇచ్చిందని అన్నారు.ఇక తెలంగాణ అభివృద్ధి పేరిట చేస్తున్న అప్పులు జనం మీద మోపుతూ, తెలంగాణని నీళ్ళు, నిధులు, నియామకాల పేరుతో నిండా ముంచాడని, కాళేశ్వరం నీళ్లు సముద్రం పాలు, ఉద్యోగాలు ఖాళీ, నిధులు దొంగల పాలు చేశాడని ఎద్దేవా చేశాడట.

ఇదే కాకుండా కేసీఆర్ కిట్ పేరుతో అప్పుడే పుట్టినోడి నెత్తిన లక్ష అప్పు వేశాడని, ఇంత దగాకోరు ప్రభుత్వం ఇంకోటి లేదని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ పొన్నాలా ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube