ఇవాంకా, ట్రంప్ లపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్….!!  

Sensational allegations against Ivanka and Trump, Ivanka , Trump, empire falls, Astram, Ivanka Friend, - Telugu Astram, Empire Falls, Ivanka, Ivanka Friend, Trump

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.గతంలో ఎన్నడూ వినని విధంగా ఈ ఆరోపణలు రావడంతో అందరూ ఆశ్చర్య పోతున్నారు.

TeluguStop.com - Sensational Allegations Against Ivanka And Trump

ఈ ఆరోపణలు చేసింది కూడా ఎవరో కాదు ఇవాంకా కు స్నేహితురాలైన ఆస్ట్రామ్ అనే మహిళా జర్నలిస్ట్.ట్రంప్ అధ్యక్షుడి అయ్యింది మొదలు ఇప్పటి వరకూ వచ్చిన ఆరోపణలు అన్నీ ట్రంప్ చుట్టూ తిరిగాయి కానీ ఇప్పటి వరకూ ఇవాంకా పై ఎలాంటి ఆరోపణలు రాలేదు కానీ మొదటి సారిగా ఇవాంకా పై ఆరోపణలు రావడంతో అమెరికా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాసం అవుతోంది…వివరాలలోకి వెళ్తే.

ఇవాంకా కు చిన్నతనం నుంచీ ఫేమస్ అవ్వాలని ఆరాటం ఎక్కువగా ఉండేదని, టీచర్స్ ఆమెను మెచ్చుకుంటే వాటిని అందరికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకునేదని ఆస్ట్రామ్ తెలిపింది.చదువులో ముందు ఉండే ఇవాంకా కు తాను “ఎంపైర్ ఫాల్స్” అనే పుస్తకాన్ని చదవమని చెప్పానని అందుకు ఇవాంకా నేను పేద వాళ్ళ కధలు చదువుతానని అనుకుంటున్నావా అని సమాధానం ఇచ్చిందని తెలిపింది.

TeluguStop.com - ఇవాంకా, ట్రంప్ లపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా జర్నలిస్ట్….-General-Telugu-Telugu Tollywood Photo Image

కాలం గడుస్తున్న కొద్దీ ట్రంప్ ప్రభావం తనపై పూర్తిగా పడిందని ఆస్ట్రామ్ తెలిపింది.అంతేకాదు ట్రంప్ సైతం ఇవాంకా చుట్టూ ఎవరు ఉన్నారోనని వాకబు చేసేవారని, స్టేటస్ ఉన్న వారి పిల్లలు ఇవాంకా చుట్టూ ఉండేలా ట్రంప్ చేసేవారని ఆరోపించింది.అంతేకాదు

ట్రంప్ ఓ సారి ఆస్ట్రామ్ ను పిలిపించి తన కూతురు ఇవాంకా కంటే అందమైన వాళ్ళు ఎవరున్నారు మీ క్లాసు లో అని అడిగారట.ఇవాంకా కంటే అందగత్తెలు, బాగా పాపులర్ అవుతున్న అమ్మాయిలు ఉన్నారా అంటూ పదేపదే అడిగేవారని ,దానికి బదులుగా ఇవాంకా టాప్ -5 లో ఉంటుందని ఆస్ట్రామ్ చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంది.ఇవాంకా, ట్రంప్ నుంచీ ఏమి నేర్చుకోకూడదో అవే నేర్చుకుందని ట్రంప్ ప్రభావం ఆమెపై తప్పకుండా ప్రభావం చూపనుందని ఆరోపించింది.

#Ivanka Friend #Empire Falls #Trump #Ivanka #Astram

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Sensational Allegations Against Ivanka And Trump Related Telugu News,Photos/Pics,Images..