స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల కలెక్షన్లు ఎంతో మీకు తెలుసా?

అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సినిమా నిర్మాతలకు భారీగా లాభాలను అందించింది.

 Sensatioanl Rajamouli Completed 20 Years Career  As Director His Movie Collectio-TeluguStop.com

రాజమౌళి తొలి సినిమా స్టూడెంట్ నంబర్1 2001 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ కాగా ఈ సినిమా విడుదలై నేటికి 20 సంవత్సరాలు పూర్తి కావడం గమనార్హం.

ప్రస్తుతం ఇండియాలో నంబర్ 1 దర్శకునిగా దర్శకధీరుడు రాజమౌళి ఉన్నారు.

ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాను 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 2 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 12 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

రాజమౌళి మరో సినిమా సింహాద్రి 8 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 26 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Telugu Chtrapati, Magadheers, Rajamouli, Sye, Yamadonga-Movie

సింహాద్రి తర్వాత రాజమౌళి సై సినిమాకు దర్శకత్వం వహించగా ఈ సినిమా 5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 9.5 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.ఛత్రపతి సినిమా 10 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 21 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.విక్రమార్కుడు సినిమా 11 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 23 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

Telugu Chtrapati, Magadheers, Rajamouli, Sye, Yamadonga-Movie

మరో భారీ బడ్జెట్ సినిమా యమదొంగ 18 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కి 29 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.44 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మగధీర 78 కోట్ల రూపాయలు, 14 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మర్యాదరామన్న 29 కోట్ల రూపాయలు, 26 కోట్ల రుపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈగ 45 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది.బాహుబలి ది బిగినింగ్ 136 కోట్ల రూపాయల బడ్జెట్ తో 600 కోట్ల రూపాయలు, బహుబలి2 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి 854 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube