పాలించడం అంటే జబర్దస్త్ స్కిట్ చేసినంత ఈజీ కాదంటున్న సీనియర్ హీరోయిన్...

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది.ఇందులో భాగంగా అధికార పక్షాలు, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటున్నారు.

 Senoir Actress Divyavani React About Roja Comments-TeluguStop.com

ఇందులో భాగంగా తాజాగా నగరి ఎమ్మెల్యే, సీనియర్ హీరోయిన్ అయినటువంటి ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఆయన తనయుడు నారా లోకేష్ పై పలు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.ఇందులో భాగంగా తొందర్లోనే చంద్రబాబు నాయుడు మరియు ఆయన  తనయుడు లోకేష్ చేసిన తప్పులకు ప్రతిఫలంగా జైలుకు వెళ్ళబోతూ ఉన్నారని, అంతేగాక చంద్రబాబు నాయుడు తన శేష జీవితాన్ని జైల్లోనే గడపనున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.

దీంతో ఎమ్మెల్యే రోజా పై తెలుగుదేశం పార్టీ నాయకులు, నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ మహిళా నేత అయినటువంటి సీనియర్ నటి దివ్యవాణి రోజా చేసినటువంటి ఈ ఘాటు వ్యాఖ్యలపై స్పందించారు.

ఈ క్రమంలో ప్రజలను పాలించడం అంటే మేకప్ వేసుకోవడం, జబర్దస్త్ స్కిట్లు చేసే అంత ఈజీ కాదని వ్యంగ్యంగా ఎద్దేవా చేశారు.అంతేగాక ఆర్కే రోజా సొంత నియోజక వర్గం అయినటువంటి నగరిలో ఆమె పరిపాలనని అసహ్యించుకుంటున్నారని ముందు తన నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలో ఆలోచించాలని సూచించారు.

అంతేగాక ఒకరిపై అణుచులంతా వ్యాఖ్యలు చేసే ముందు తామేంటో గుర్తుంచుకోవాలని అన్నారు.

Telugu Divyavani, Mla Roja, Tdppolitician, Telugusenior, Ysrcp Mla Roja-Politica

అయితే ఇది ఇలా ఉండగా దివ్యవాణి అప్పట్లో సినిమాల్లో బాగానే రాణించినప్పటికీ వయసు పై పడడంతో క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి.దీంతో దివ్యవాణి తెలుగులో పలు రకాల సీరియల్ లో కూడా నటించింది.అయితే ఆ తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరి  పార్టీకి తనవంతు  సేవలను అందిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube