జబర్దస్త్‌లో నాగబాబు సీటుపై కన్నేశాడు, దక్కేనా?

మెగా బ్రదర్‌ నాగబాబు జబర్దస్త్‌ కామెడీ షో నుండి తప్పుకున్నాడు.ఆయన లేకపోవడంతో ఆ స్థానంను ఎవరితో భర్తీ చేయించాలనే విషయమై ప్రస్తుతం జబర్దస్త్‌ టీం మల్లెమాల వారు ఆలోచిస్తున్నారట.

 Seniour Naresh Looking For Jabardasth Judge Post-TeluguStop.com

ఎంతో మంది ప్రముఖుల పేర్లు పరిశీలించిన తర్వాత కొందరి పేర్లను ఫైనల్‌ జాబితాలో చేర్చారట.అందులో ఒక్కరిని ఎంపిక చేస్తారని సమాచారం అందుతోంది.

ఈ సమయంలోనే సీనియర్‌ నరేష్‌ తనకు జబర్దస్త్‌పై ఆసక్తి ఉందంటూ ప్రకటన చేశాడు.

Telugu Nagababu, Roja Jabardasth, Naresh, Tollywoodactors-

ఆయన పేరు పరిశీలిస్తున్నారో లేదో తెలియదు కాని ఆయన మాత్రం తనకు జబర్దస్త్‌ అంటే ఇష్టం తప్పకుండా అవకాశం వస్తే చేసేందుకు సిద్దంగా ఉన్నానంటూ ప్రకటించాడు.జబర్దస్త్‌ ఫేం నాగబాబు లేని లోటును భర్తీ చేయడం అంటే మామూలు విషయం కాదు.ప్రేక్షకులు ఆయనకు బాగా కనెక్ట్‌ అయ్యారు.

అందుకే ఆయన స్థానంలోకి వచ్చే వారు చాలా ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుంది.అంతగా ఆకట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు.

Telugu Nagababu, Roja Jabardasth, Naresh, Tollywoodactors-

మరి నటుడిగా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్న నరేష్‌ జబర్దస్త్‌లో చాన్స్‌ వస్తే ఏ మేరకు రాణిస్తాడు.అసలు జబర్దస్త్‌కు ఆయన స్వభావం వర్కౌట్‌ అయ్యేనా, సూట్‌ అయ్యేనా అంటూ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.పెద్ద ఎత్తున జనాలు జబర్దస్త్‌ గురించిన వార్తలు రాస్తున్నారు.ఈ నేపథ్యంలో నరేష్‌ ఎంట్రీ విషయమై కూడా మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలపై మల్లెమాల వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube