నాడు టీడీపీలో ర‌గ‌డ‌.. నేడు వైసీపీ‌లో గ‌డ‌బిడ‌.. సీనియ‌ర్ రాజ‌కీయాలు సిల్లీ...!

రాజ‌కీయాల్లో ఆయ‌న సీనియ‌ర్ మోస్ట్ నాయ‌కుడు.ఫార్టీ ఇయ‌ర్స్‌గా ఆయ‌న పాలిటిక్స్ వెల‌గ‌బెడుతున్నారు.ఒక‌ర‌కంగా చెప్పాలంటే.ఇంత సీనియ‌ర్ అయిన నాయ‌కుడు ప‌ట్టుమని ప‌ది మందితో అయినా.గ్రేట్ లీడ‌ర్ అని అనిపించుకునే రేంజ్‌లో ఉంటార‌ని ఎవ‌రైనా ఆశిస్తారు.అంతేకాదు, ఆయ‌న బాట‌లో న‌డిచేందుకు కూడా చాలా మంది ఉత్సాహం చూపిస్తారు.

 Seniors Doing Silly Politics In Ysrcp, Andhra Pradesh, Ap, Full Fightings, Jagan-TeluguStop.com

ఎందుకంటే.సీనియ‌ర్ల‌కు కొర‌త ఏర్ప‌డిన రాజ‌కీయాల్లో ఏపీ ఉన్న నేప‌థ్యంలో సీనియ‌ర్‌ల‌కు విలువ పెరుగుతోంది.

వారి సూచ‌న‌లు స‌ల‌హాల కోసం ఇప్ప‌టికీ జూనియ‌ర్లు క్యూ క‌డుతూనే ఉన్నారు.మ‌రి ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అయిన‌.

స‌ద‌రు నేత‌.మాత్రం సిల్లీ వ్య‌వ‌హారాలు న‌డుపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఆయ‌నే.ప్ర‌కాశం జిల్లాకు చెందిన క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.

సీనియార్టీ ప‌రంగా ఆయ‌న‌ను మించిన నాయ‌కుడు జిల్లాలో లేర‌నే చెప్పాలి.

అయితే.

ఆయ‌న వ్య‌వ‌హార శైలి.అడుగ‌డుగునా వివాదాల‌కు కేంద్రంగా మార‌డం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.

మాత్రం క‌ర‌ణం.తీవ్ర వివాదాల‌కు కేంద్రంగా మారారు.

గ‌తంలో అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న స‌మ‌యంలో స‌ర్వం ఆయ‌నే అయి చ‌క్రం తిప్పారు.ఎక్క‌డిక‌క్క‌డ వివాదాల‌కు కేంద్రంగా మారారు.

త‌న‌కు తిరుగులేకుండా చేసుకునే ప్ర‌య‌త్నంలో దశాబ్దాలుగా గొట్టిపాటి కుటుంబంతో ఘ‌ర్ష‌ణ‌లు పెట్టుకున్నారు.ఇవే త‌ర్వాత త‌రానికి కూడా కొన‌సాగాయి.

Telugu Andhra Pradesh, Chandra Babu, Full, Gottipati Ravi, Ysrcp-Telugu Politica

ఇక‌, 2014లో టీడీపీ త‌ర‌ఫున ఓడిపోవ‌డంతో.ఇక్క‌డ గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌విని.చంద్ర‌బాబు పార్టీ వ్యూహాత్మ‌క కార్యాచ‌ర‌ణ‌లో భాగంగా.టీడీపీలోకి చేర్చుకున్నారు.దీంతో మ‌రింత‌గా అగ్గిమీద గుగ్గిలం అయిన‌.క‌ర‌ణం… నిత్యం వివాదాల‌తోనే సంసారం చేశారు.పోనీ.గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో క‌ర‌ణం బ‌ల‌రాంను చంద్ర‌బాబు చీరాల‌కు బ‌దిలీ చేశారు.ఇక్క‌డ ఆయ‌న గెలుపు గుర్రం ఎక్కారు.పోనీ.

ఇక్క‌డైనా ప్ర‌శాంతంగా ఆయ‌న ఉంటున్నారా?  నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లను ఉండ‌నిస్తున్నారా? అంటే.ఏదీ లేదు.

ఇక్క‌డ కూడా సేమ్ అద్దంకి సీన్ కొన‌సాగుతోంది.

కొన్నాళ్ల కింద‌ట ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారారు.

అయినా కూడా నిత్యం ఘ‌ర్ష‌ణ‌లే.నిత్యం వివాదాలతోనే ముందుకు సాగుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌కాశం జిల్లాలో వినిపిస్తున్నాయి.

అడుగు తీస్తే.వివాదం అన్న‌ట్టుగా కొన‌సాగుతున్నారు.

సొంత పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.వివాదాల‌కు దిగుతున్నారు.

దీంతో క‌రణం బ‌ల‌రాం ఎక్క‌డున్నా.నిత్య వివాదాలే అంటూ.

జిల్లా ప్ర‌జ‌లు గ‌గ్గోలు పెడుతున్నారు.ఎన్ని ద‌శాబ్దాలు రాజ‌కీయాల్లో ఉన్నా ఆయ‌న మార్క్ అభివృద్ధి లేద‌ని వాపోతున్నారు.

మ‌రి ఈయ‌న సీనియార్టీ దేనికి ప్ర‌యోజ‌నం.ఎవ‌రికి ప్ర‌యోజ‌నం అనే టాక్ స‌ర్వ‌త్రా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube