తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలుగాంచిన కుటుంబం అల్లు వారి కుటుంబం.అలనాటి సినిమాలలో అల్లు రామలింగయ్య ఎంతో అద్భుతంగా నటించి అందరిని నవ్వించే వాడు.
తరువాత తన వారసత్వంగా అల్లు అరవింద్ ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు.అయితే అల్లు అరవింద్ స్థాపించిన గీత ఆర్ట్స్ బ్యానర్ పైఎన్నో సినిమాలను నిర్మించి, ప్రముఖ నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు.
గీత ఆర్ట్స్ పతాకంపై చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి.అయితే ఈ కుటుంబం నుంచి ఇద్దరు హీరోలు మన వెండితెరకు పరిచయం అయ్యారు.
స్టైలిష్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ సొంత బ్యానర్ పై సినిమాలు చేసి విజయాలను అందుకున్నాడు.మరొకరు అల్లు శిరీష్ కొన్ని సినిమాలలో కనిపించినప్పటికీ, తర్వాత సినిమాల విషయంలో విరామం తీసుకున్నారు.

సాధారణంగా అల్లు అరవింద్ కుటుంబం గురించి అందరికీ కేవలం తన ఇద్దరు కొడుకుల గురించి మాత్రమే తెలుసు.కానీ అల్లు అరవింద్ గారి పెద్ద కొడుకు వెంకటేష్ గురించి ఎవరికీ తెలియదు.అల్లు అరవింద్ గురించి ఒక ఆసక్తికరమైన విషయం పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేస్తూ….ఎంతో ధైర్యసాహసాలతో ఎటువంటి సమస్యనైనా ఎదుర్కొని నిలబడే అల్లు అరవింద్ ఏకంగా దేవుడితో పందెం కట్టి తనేంటో నిరూపించుకున్నాడు.
అల్లు అరవింద్ గారికి ముగ్గురు కొడుకులు అన్న విషయం మనకు తెలిసిందే.అయితే తన మూడో కుమారుడు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు.
ముగ్గురు కుమారులు ఉండటం వల్ల పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ చేయించుకున్న అల్లుఅరవింద్, ఎలాగైనా తిరిగి తన మూడో కొడుకును పొందాలనుకుని పిల్లలు కావడానికి మరి ఆపరేషన్ చేయించుకోని తన మూడవ కొడుకుని కన్నాడు.ఇలా దేవుడితో చాలెంజ్ చేసి చనిపోయిన తన మూడో కొడుకును తిరిగి తన మూడవ కొడుకుగా కనీ తనేంటో నిరూపించుకున్న వ్యక్తి అని ఓ సందర్భంలో పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.