ఫైర్ బ్రాండ్లు లేరు.. ప‌నిచేసేదెవ‌రు…  టీడీపీలో టాక్..!  

no fire brands in TDP, TDP,Andhra pradesh,Chandrabbau naidu ,YS Jagan,ysrcp, vangalapudi anitha , Bhooma akhila priya,AP Politics - Telugu Andhra Pradesh, Ap Politics, Bhooma Akhila Priya, Chandrabbau Naidu, No Fire Brands In Tdp, Tdp, Vangalapudi Anitha, Ys Jagan, Ysrcp

రాజ‌కీయాల్లో ఫైర్ బ్రాండ్ల‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.పార్టీ త‌ర‌ఫున వాయిస్‌వినిపించాల‌న్నా.

TeluguStop.com - Senior Tdp Leaders Silence Party Activities Chandra Babu

ప్ర‌త్య‌ర్తుల‌కు కౌంట‌ర్లు ఇవ్వాల‌న్నా.వారి త‌ర్వాతే.

అన్న‌ట్టుగా ఉంటుంది రాజ‌కీయం.దీంతో ప్ర‌తి పార్టీ కూడా ఫైర్ బ్రాండ్ నాయ‌కుల‌కు ఎన‌లేని ప్రాధాన్యం ఇస్తూనే ఉంటుంది.

TeluguStop.com - ఫైర్ బ్రాండ్లు లేరు.. ప‌నిచేసేదెవ‌రు…  టీడీపీలో టాక్..-Political-Telugu Tollywood Photo Image

ఈ క్ర‌మంలోనే టీడీపీలోనూ గ‌తంలో ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు ఫైర్ బ్రాండ్ల‌ను ఏమీ అనేవారు కాదు.దీంతో వారు రెచ్చిపోయారు.

చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, బొండా ఉమా, య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, పంచుమ‌ర్తి అనురాధ‌.ఇలా చాలా మంది ఫైర్ బ్రాండ్లుగా ఉన్నారు.

దీంతో పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపించేవారు.

అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది.

టీడీపీలో చూద్దామ‌న్నా.ఫైర్‌బ్రాండ్లు క‌నిపించ‌డం లేదు.

గ‌తంలో వైసీపీ నాయ‌కురాలు.రోజాతో ఢీ అంటే ఢీ అన్న టీడీపీ నాయ‌కురాలు వంగ‌ల‌పూడి అనిత కూడా సైలెంట్ అయ్యారు.

ఆమె అస‌లు మీడియాకు క‌నిపించ‌డ మే లేదు.ఇక‌, అసెంబ్లీలోనే చీరేస్తా.

న‌రికేస్తా.అంటూ వ్యాఖ్య‌లు సంధించిన బొండా ఉమా ప‌రిస్థితి కూడా అంతే.

అలాగే ఉంది.ఆయ‌న ఇప్పుడు పెద్ద‌గా మీడియా ముందుకు రావ‌డం లేదు.

ఆయ‌న కుటుంబంపై భూ వివాదానికి సంబందించిన కేసులు ఉన్నాయి.దీంతో ఈ ఫ్యామిలీ ఫుల్లుగా సైలెంట్ అయింది.

అదేసమ‌యంలో ప‌శ్చిమ గోదావ‌రికి చెందిన చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ కూడా ఫైర్ బ్రాండ్ నాయ‌కుడిగా గుర్తింపుపొందారు.ఆయ‌న నోరు విప్పితే.వార్త అయిపోయింది.యూట్యూబ్‌లో లైకులు, వ్యూస్ భారీగా వ‌చ్చేవి.

అయితే, ఆయ‌న ప‌లు మార్లు జైలుకు వెళ్లి వ‌చ్చాక‌.త‌న‌కు టీడీపీ నుంచి త‌గినంత స‌పోర్టు లేద‌ని తెలుసుకున్నాక‌.

సైలెంట్ అయ్యార‌ని అంటున్నారు.మొత్తానికి, ఆయ‌న ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని అంటున్నారు.

అయితే, ఇప్పుడు అర‌కొర‌గా మీడియాముందుకు వ‌స్తున్న వారిలో.మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు ఒక్క‌రే క‌నిపిస్తున్నాయి.క‌ర్నూలుకు చెందిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా ఇటీవ‌ల వ‌ర‌కు బాగానే వాయిస్ వినిపించినా.పార్టీ ప‌ద‌వుల్లో ప్రాధాన్యం లేక‌పోయేస‌రికి నాకెందుకు? అనే ధోర‌ణిని అవ‌లంబిస్తున్న‌ట్టు తెలుస్తోంది.మొత్తానికి ఫైర్‌బ్రాండ్లు లేక‌పోవ‌డం పార్టీ డ్రాబ్యాక్‌గానే మారింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

#BhoomaAkhila #AP Politics #Ysrcp #Andhra Pradesh #YS Jagan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Senior Tdp Leaders Silence Party Activities Chandra Babu Related Telugu News,Photos/Pics,Images..